NATURAL STAR NANI WRAPPED UP ANTE SUNDARINIKI MOVIE AFTER SHYAM SINGHA ROY HERE ARE THE DETAILS TA
Nani : నాని స్పీడు మాములుగా లేదుగా.. అపుడే మరో సినిమాకు గుమ్మడికాయ కొట్టేసిన నాచురల్ స్టార్..
నాని (Nani Photo: Twitter)
Nani - Ante Sundaraniki : నాచురల్ స్టార్ నాని ' సినిమాల విషయంలో మాములుగా స్పీడ్‌గా లేడు. ఒక సినిమా కంప్లీట్ అవ్వడమే లేదో మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు. తాజాగా ‘అంటే సుందరానికి’ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసాడు.
Nani - Ante Sundaraniki : నాచురల్ స్టార్ నాని ' సినిమాల విషయంలో మాములుగా స్పీడ్‌గా లేడు. ఒక సినిమా కంప్లీట్ అవ్వడమే లేదో మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు. గతేడాది ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలతో పలకరించారు. ఇందులో ‘టక్ జగదీష్’ ఓటీటీ వేదికగా విడుదలైన డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’(Shyam Singha Roy) మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేద్దామనుకున్నారు. కానీ కుదరలేదు.
ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్లో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సంగతి పక్కన పెడితే.. నాని .. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాకు షూటింగ్ కంప్లీట్ కావడంతో చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టేసారు.
‘అంటే సుందరానికి’ టైటిల్ పోస్టర్లో నాని వెనకాల తిరిగి పంచె కట్టులో పల్లెటూరు యువకుడి పాత్రలో నటించబోతున్నట్టు కనబడుతోంది. అంతేకాదు పల్లెటూరులో ఏదో గీతాలు పాడుకునే వ్యక్తి విదేశాల్లో రాక్ స్టార్‌గా ఎలా అలరించడనేదే ఈ సినిమా స్టోరీ అన్నట్టు కనబడుతోంది. పోస్టర్లో వీణ, కెమెరా కూడా ఉన్నాయి. ఇప్పటికే నాని.. ’కృష్ణార్జున యుద్ధం’లో రాక్ స్టార్ పాత్రలో అలరించిన సంగతి తెలిసిందేె కదా. ఇపుడు ‘అంటే సుందరానికి’ సినిమాలో అదే తరహా పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమా అడల్ట్ కామెడీ జానర్లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
‘అంటే.. సుందరానికి’ సినిమాలో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్ నటిస్తున్నారు. సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు. దీంతో పాటు నాని ప్రస్తుతం ‘దసరా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్గా నటించబోతుంది. ఈ సినిమాను వచ్చే విజయ దశమి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా పూర్తి మాస్ ఎంటర్టైనర్గా రానుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.