NATURAL STAR NANI V MOVIE NEW POSTER RELEASED AND LOOK GOES VIRAL IN SOCIAL MEDIA PK
V Movie Look: రక్షకుడు, రాక్షసుడు కలిసొచ్చారుగా..
నాని వి సినిమా పోస్టర్ (Nani V movie poster)
V The Movie: నాని విలన్ అవుతున్నాడని తెలిసిందే. వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈయనకు ఇప్పుడు ప్రతినాయకుడిగా నటించాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? కథ కుదిరినపుడు విలన్..
నాని విలన్ అవుతున్నాడని తెలిసిందే. వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈయనకు ఇప్పుడు ప్రతినాయకుడిగా నటించాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? కథ కుదిరినపుడు విలన్ కావడంలో తప్పేం లేదని చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటి హీరోలే నిరూపించారు. ఇప్పుడు నాని కూడా ఇదే చేస్తున్నాడు. అందులోనూ తన సినిమాలో తను విలన్ అయిపోయి.. మరో హీరో హీరోగా నటిస్తుండటం విశేషం. అన్నింటికి మించీ 25వ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు న్యాచులర్ స్టార్. తాజాగా వి సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. ఇందులో సుధీర్ బాబు, నాని లుక్స్ అదిరిపోయాయి.
నాని వి సినిమా పోస్టర్ (Nani V movie poster)
ఇప్పటికే వి సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. కొన్ని రోజుల షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా పూర్తైపోతే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీ కానున్నారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ చిత్రం రాక్షసుడిగా నాని నటిస్తున్నాడు. సైకో కిల్లర్ పాత్రలో ఇందులో నాని నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తను ప్రేమించిన నివేదా థామస్ చనిపోవడంతో ఆమె కోసం సైకోగా మారిపోతాడని తెలుస్తుంది. ఇక అతన్ని పట్టుకునే రక్షకుడిగా సుధీర్ బాబు కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఇద్దరి పోస్టర్స్ అదిరిపోయాయి. ఇప్పుడు ఇద్దర్నీ ఒకే పోస్టర్లో విడుదల చేసాడు దర్శకుడు ఇంద్రగంటి.
ఇప్పటికే దిల్ రాజు కాంబినేషన్లో ‘నేను లోకల్’, ‘ఎంసిఏ’ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చాడు నాని.. మరోవైపు ‘అష్టాచమ్మా’, ‘జెంటిల్ మెన్’ సినిమాల తర్వాత ఇంద్రగంటితో నాని చేయబోయే సినిమా ఇది. ఎటు చూసుకున్నా కూడా హ్యాట్రిక్ మూవీ అవుతుంది. ఈ సినిమాలో నాని విలన్ అయితే.. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. జెంటిల్ మెన్ సినిమాలో కాసేపు నెగిటివ్ ఛాయలున్నట్లు నటించినా కూడా అది చివరికి హీరో అయిపోయింది. అయితే ఈ సారి మాత్రం నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. అదంతా ఇంద్రగంటిపై నానికి ఉన్న నమ్మకమే. మరి న్యాచురల్ స్టార్ విలన్ వేషాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. మార్చ్ 25న ఉగాది కానుకగా సినిమా విడుదల కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.