NATURAL STAR NANI V MOVIE DUBBED IN BOLLYWOOD AND SURIYA AAKASAM NEE HADDURA MOVIE ALSO RELEASED IN HINDI TA
Nani: బాలీవుడ్ వెళుతున్న నాని ఫ్లాప్ మూవీ.. నాచురల్ స్టార్ మూవీ పాటు మరో క్రేజీ హీరో మూవీ..
నాచురల్ స్టార్ నాని (File/Photo)
Nani | గత కొన్నేళ్లులుగా మన తెలుగు సినిమాలకు హిందీలో మంచి గిరాకీ ఉంది. ఇక్కడ హిట్టైన సినిమాలతో పాటు ఫ్లాపైన సినిమాలను గంపగుత్తగా హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా నానితో పాటు మరో క్రేజీ హీరో సినిమా హిందీలో డబ్ కానుంది.
Nani | గత కొన్నేళ్లులుగా మన తెలుగు సినిమాలకు హిందీలో మంచి గిరాకీ ఉంది. ఇక్కడ హిట్టైన సినిమాలతో పాటు ఫ్లాపైన సినిమాలను గంపగుత్తగా హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దాదాపు హిందీలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్‌కు తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోని చిత్రాలే కీలకం. కొంచెం పేరున్న హీరో సినిమా అయితే వాటికి చాలా డిమాండ్ ఉంటుంది. తాజాగా గతేడాది నాని హీరోగా నటించిన ‘వీ’ సినిమా కరోనా కారణంగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. కానీ అక్కడ ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా హీరోగా నానికి 25వ సినిమా. తన బెంచ్ మార్క్ సినిమా థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాలో సుధీర్ బాబు మరో కథానాయకుడిగా నటించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు.
ఈ సినిమాను ఇపుడు హిందీలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. బాలీవుడ్లో పేరున్న నిర్మాణ సంస్థ ఈ సినిమా డబ్బింగ్ మరియు శాటిలైట్, డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. త్వరలోనే ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు సూర్య హీరోగా నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు.
కానీ ఈ సినిమాను హిందీలో ‘ఉడాన్’ పేరుతో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మొత్తంగా నాని, సూర్యకు సంబంధించిన చిత్రాలు ఇపుడు బాలీవుడ్లో ఏ మేరకు అలరిస్తాయో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.