Nani : ఆ స్టార్ హీరో కోసం విలన్‌గా మారుతున్న నాని.. నాచురల్ స్టార్ కొత్త ఇన్నింగ్స్..

నాని (Twitter/Photo)

Nani :  గత కొన్నేళ్లుగా మన హీరోల మైండ్ సెట్ మారింది. కేవలం హీరోగా పరిమితం కాకుండా.. అన్ని రకాల పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఈ కోవలోనే నాని కూడా ఓ స్టార్ హీరో కోసం విలన్‌గా మారుతున్నారు.

 • Share this:
  Nani :  గత కొన్నేళ్లుగా మన హీరోల మైండ్ సెట్ మారింది. కేవలం హీరోగా పరిమితం కాకుండా.. అన్ని రకాల పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. స్టార్ హీరోలు కాకుండా మిడ్ రేంజ్ హీరోలు.. కథానాయికుడిగా నటిస్తూనే ప్రతి నాయకుడిగా యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెతున్నారు. ఇప్పటికే విజయ్ సేతుపతి, ఆది పినిశెట్టి, కార్తికేయ వంటి హీరోలు విలన్‌గా కూడా యాక్ట్ చేసిన మెప్పిస్తున్నారు. ఈ కోవలోనే హీరో నాని కూడా విలన్‌గా యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే కదా. ప్యాన్ ఇండియ ా రేంజ్‌లో తెరకెక్కుతోన్న  ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని విలన్‌గా యాక్ట్ చేయబోతున్నట్టు సమాచారం.

  ఈ సినిమా కోసం నానికి భారీ మొత్తంలో పారితోషకం ముట్టజెప్పబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో నాచురల్ స్టార్ నాని పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉందట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా పూర్తిస్థాయి తెలుగు చిత్రం తెరకెక్కబోతోంది. ప్రస్తుతం తెలుగు సినిమాతో పాటు తమిళంలో వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా విజయ్ వంశీ కాంబోలో ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

  Super Star Krishna : అప్పట్లోనే సూపర్ స్టార్ కృష్ణ చేసిన ఈ సూపర్ హిట్ సీక్వెల్ మూవీ తెలుసా..

  అయితే ఈ సినిమా ఏ కథాంశం తెరకెక్కుతోంది? ఇందులో హీరోయిన్ ఎవరు? సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే విషయాల గురించి త్వరలోనే తెలియజేయునునట్లు చిత్రబృందం వెల్లడించారు. మొట్ట మొదటిసారిగా పూర్తిస్థాయి తెలుగులో నటిస్తున్న విజయ్ ఈ సినిమా ద్వారా ఏ విధంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచిచూడాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నటించడం కోసం విజయ్ భారీ మొత్తంలోనే రూ. 100 కోట్ల వరకు  రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

  Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

  నాని విషయానికొస్తే.. ఈయన హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ సినిమా వినాయక చవితి  కానుకగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. నాని ఇతర సినిమాల విషయానికి వస్తే.. ట్యాక్సీవాలా' ఫేమ్‌ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 27వ సినిమాగా శ్యామ్ సింగరాయ్’ సినిమా చేస్తున్నారు. కలకత్తా నేపథ్యంలో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

  Puri Jagannadh Introduced Heroines: రేణు దేశాయ్, అనుష్క, అసిన్ సహా పూరీ జగన్నాథ్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన హీరోయిన్స్ వీళ్లే..

  ఈ మూవీకి వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. సాయి పల్లవి, 'ఉప్పెన' ఫేమ్‌ కృతిశెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని 70 ఏళ్ల వయసు మళ్లిన వ్యక్తిగా ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీకి మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించబోతున్నారు.నాని ఈ మూవీలతో  పాటు 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే ఓ అడల్ట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ని చేస్తున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: