Home /News /movies /

NATURAL STAR NANI TUCK JAGADISH TEASER RELEASED AND SHIVA NIRVANA COMES UP WITH MASS FAMILY DRAMA PK

Nani Tuck Jagadish Teaser: ప్రభాస్‌కు ‘మిర్చి’.. నానికి ‘టక్ జగదీష్’..

నాని టక్ జగదీష్ టీజర్ (Nani Tuck Jagadish Teaser)

నాని టక్ జగదీష్ టీజర్ (Nani Tuck Jagadish Teaser)

Nani Tuck Jagadish Teaser: ఇదేం పోలికబ్బా.. అస్సలు అర్థం కాలేదు అనుకుంటున్నారా..? ఒక్కసారి ప్రభాస్ మిర్చి సినిమాను గుర్తు చేసుకోండి. అందులో హీరో టక్ చేసుకుని సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిలా కనిపిస్తుంటాడు. కానీ చేసే పనులన్నీ పక్కా హార్డ్ వేర్.

ఇంకా చదవండి ...
ఇదేం పోలికబ్బా.. అస్సలు అర్థం కాలేదు అనుకుంటున్నారా..? ఒక్కసారి ప్రభాస్ మిర్చి సినిమాను గుర్తు చేసుకోండి. అందులో హీరో టక్ చేసుకుని సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిలా కనిపిస్తుంటాడు. కానీ చేసే పనులన్నీ పక్కా హార్డ్ వేర్. తన ఫ్యామిలీ జోలికి వస్తే సాఫ్ట్ వేర్ కాస్తా హార్డ్ వేర్ అయిపోతాడు. కానీ వేసిన చొక్కా వేసినట్లే ఉంటుంది.. టక్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు నాని నటిస్తున్న టక్ జగదీష్ టీజర్ చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫిబ్రవరి 24న నాని పుట్టిన రోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. అన్ని టీజర్స్ మాదిరి కాకుండా దీన్ని చాలా కొత్తగా కట్ చేసారు దర్శక నిర్మాతలు. సాధారణంగా టీజర్ అంటే డైలాగులు, కామెడీ ఊహిస్తాం కానీ ఇందులో మాత్రం కేవలం పాట మాత్రమే ఉంది. అలా కట్ చేసి వదిలాడు శివ నిర్వాణ. జెర్సీ తర్వాత సరైన విజయం లేని నాని టక్ జగదీష్‌తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ అటాక్ చేస్తానంటున్నాడు. నిన్నుకోరి తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇందులో జగపతిబాబు అన్నయ్యగా నటిస్తున్నాడు. పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. అల వైకుంఠపురములో క్లైమాక్స్ సాంగ్ మాదిరే ఇక్కడ టీజర్‌లోనూ ఓ పాటను వదిలాడు తమన్. అందులోనే కథ చెప్పాడు దర్శకుడు శివ. నిన్నుకోరి, మజిలీ లాంటి హిట్ సినిమాల తర్వాత శివ నుంచి వస్తున్న సినిమా కావడంతో బిజినెస్ భారీగానే జరుగుతుంది.

ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టి స్టార్ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోవాలని చూస్తున్నాడు శివ నిర్వాణ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న టక్ జగదీష్ ఎప్రిల్ 23న విడుదల కానుంది. టీజర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు మరింత పెంచేలా కనిపిస్తుంది. నాని కూడా చాలా రోజుల తర్వాత పక్కా కమర్షియల్ మాస్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ టక్ జగదీష్‌తో న్యాచురల్ స్టార్ ఏ మేరకు రెచ్చిపోతాడో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Hero nani, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు