హోమ్ /వార్తలు /సినిమా /

Nani Tuck Jagadish: నాని ‘టక్ జగదీష్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి కానుకగా ప్రకటించిన చిత్ర యూనిట్..

Nani Tuck Jagadish: నాని ‘టక్ జగదీష్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి కానుకగా ప్రకటించిన చిత్ర యూనిట్..

నాని టక్ జగదీష్: ఎప్రిల్ 12

నాని టక్ జగదీష్: ఎప్రిల్ 12

Nani Tuck Jagadish Release Date Fix | నాచురల్ స్టార్ నాని గతేడాది ‘వి’ అనే యాక్షన్ థ్రిల్లర్‌తో వచ్చి పరవాలేదనిపించాడు. ప్రస్తుతం చేస్తోన్న ‘టక్ జగదీష్’ మూవీని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

  Nani Tuck Jagadish Release Date Fix | నాచురల్ స్టార్ నాని గతేడాది ‘వి’ అనే యాక్షన్ థ్రిల్లర్‌తో వచ్చి పరవాలేదనిపించాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ ‘V’ సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. ఓటీటీలో విడుదలవ్వడంతో పెద్దగా రెస్పాన్స్ రాలేదని అంటున్నారు. అయితే ఈ సినిమా కనుక ఒకవేళా థియేటర్‌లో విడుదలైతే ఫలితం వేరేలాగా ఉండేదని అంటారు ఈ సినిమా ఫ్యాన్స్. ఐతే.. జనవరి 1 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమాకు పోస్టర్ ఖర్చులు రాలేదని టాక్. ఈ సినిమాలో నాని నటనకు మంచి మార్కులే పడ్డ.. రొటీన్ రివేంజ్ స్టోరీ అంటూ కామెంట్స్ వినపడ్డాయి. ఈ చిత్రంలో మరో హీరోగా సుధీర్ బాబు నటించాడు. ఏమైనా థియేటర్ మార్కెట్ ఉన్న నాని .. ఇలా తన సినిమాను ఓటీటీలో విడుదల చేయడాన్ని ఆయన అభిమానులు కూడా జీర్ధించుకోలేకపోతున్నారు. ఇక అది అలా ఉంటే తాజాగా నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే సినిమా చేస్తున్నాడు

  రీసెంట్‌గా ఈ  సినిమా షూటింగ్‌ను కరోనా నియమ నిబంధనల అనుగుణంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా  రెగ్యులర్ షూటింగ్‌లో నాని పాల్గొంటున్నాడు. మొదటి నుంచీ మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఐతే.. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్ రిలీజ్ చేయడంతో పాటు ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు.

  ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. థమన్ సంగీతం అందిస్తుండగా సన్ షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్నారు. ఇక నాని ఇతర సినిమాల విషయానికి వస్తే.. ట్యాక్సీవాలా' ఫేమ్‌ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 27వ సినిమాగా శ్యామ్ సింగరాయ్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. సాయి పల్లవి, 'ఉప్పెన' ఫేమ్‌ కృతిశెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని 70 ఏళ్ల వయసు మళ్లిన వ్యక్తిగా ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నాడు. పిరియాడిక్‌ మూవీగా రూపొందనున్న ఈ చిత్రం మొత్తం కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని విజయదశమి సందర్భంగా విడుదల చేశారు. కాగా.. ఈ చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ మూవీకి మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించబోతున్నారు.నాని ఈ మూవీలతో  పాటు 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే ఓ అడల్ట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ని చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ఇటీవల ప్రీలుక్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Nani, Tollywood, Tuck Jagadish

  ఉత్తమ కథలు