సుమ కనకాల హీరోయిన్.. నాని సినిమా.. బొమ్మ అదుర్స్..

నాని సుమ ఎఫ్ 3 షో ప్రోమో

నమ్మడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా.. కానీ ఇదే జరిగిందిప్పుడు. తాజాగా సుమ కనకాల షోకు న్యాచురల్ స్టార్ నాని వచ్చాడు. దివాళి స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేసారు. ఇందులో నాని వచ్చీ రాగానే..

  • Share this:
నమ్మడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా.. కానీ ఇదే జరిగిందిప్పుడు. తాజాగా సుమ కనకాల షోకు న్యాచురల్ స్టార్ నాని వచ్చాడు. దివాళి స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేసారు. ఇందులో నాని వచ్చీ రాగానే సుమ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. నాని నీకో మంచి ఆఫర్ ఇస్తున్నాను నేను అంటూ తనను హీరోయిన్‌గా పరిచయం చేయాలని కోరింది. దానికి అదిరిపోయే పంచ్ వేసాడు నాని. హీరోయిన్‌గా సినిమా అనగానే ఓకే అన్న నాని.. స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. ఓపెన్ చేయగానే ఓ 50 ఏళ్ల హీరోయిన్ అంటూ కామెడీ చేసాడు నాని. దాంతో సుమతో పాటు అక్కడున్న వాళ్లు కూడా పక్కుమన్నారు. ఫ్లాష్ బ్యాక్‌లో మరో హీరోయిన్ ఉంటుందంటూ సుమ వయసుపై కూడా అదిరిపోయే పంచ్ వేసాడు నేచురల్ స్టార్.

ఆ తర్వాత వెంటనే సుమ అందుకుని.. నాకు అర్థమైపోయింది నాని.. నువ్వు జీవితంలో నాతో సినిమా చేయవని అనేసింది. అంతటితో ఆగకుండా అమ్మ, అక్క పాత్రలకే నన్ను ఫిక్స్ చేయాలని నువ్వు ఫిక్స్ అయిపోయావు అంటూ నవ్వేసింది. మరోవైపు నాని కూడా అంతే ఎంజాయ్ చేసాడు ఈ జోకులను. దివాళి సందర్భంగా షూట్ చేసిన ఈ ఎపిసోడ్ మరికొన్ని గంటల్లోనే ప్లే కానుంది. ఏదేమైనా యాంకర్ సుమ సినిమాలకు దూరంగా ఉండి చాలా ఏళ్లవుతుంది. ఇప్పుడు మళ్లీ ఆమెను సినిమాల్లో చూడటం కష్టమే.
Published by:Praveen Kumar Vadla
First published: