Nani Speech: నానికి ఉన్న ధైర్యం పెద్ద హీరోలకు లేదా.. పరిస్థితులకు లొంగిపోయారా..?

ప్రభుత్వం తీరుపై నాని ఫైర్

Nani Speech: సాధారణంగా నాని(Nani) వివాదాల జోలికి వెళ్లడం ఎప్పుడూ చూడలేదు. తన పనేంటో తాను చూసుకునే హీరో ఈయన. అలాంటి హీరో ఇప్పుడు నోరు తెరిచాడు.. నిలదీసాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.

  • Share this:
సాధారణంగా నాని వివాదాల జోలికి వెళ్లడం ఎప్పుడూ చూడలేదు. తన పనేంటో తాను చూసుకునే హీరో ఈయన. అలాంటి హీరో ఇప్పుడు నోరు తెరిచాడు.. నిలదీసాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఈయన వేసిన ప్రశ్నలు విన్న తర్వాత చాలా మంది ఆలోచనలో పడిపోయారు. నిజమే కదా.. నాని అడిగిన దాంట్లో తప్పేం లేదు కదా అంటున్నారు. మరి నాని ఒక్కడే ఎందుకు మాట్లాడుతున్నాడు.. ఇండస్ట్రీ పెద్దలకు ఈ విషయంలో నోరు రావడం లేదా.. లేదంటే ధైర్యం సరిపోవడం లేదా అంటూ విమర్శిస్తున్నారు. అసలేమైందంటే.. తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన నాని అక్కడ చాలా ఎమోషనల్ అయ్యాడు. బహుశా ఆయన కెరీర్‌లోనే ఎప్పుడూ మాట్లాడనంత ఎమోషనల్‌గా మాట్లాడాడు. తన సినిమాలకు కూడా సైలెంట్‌గానే ఉండే నాని.. తిమ్మరుసు ఈవెంట్‌లో మాత్రం ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడాడు. కరోనా వచ్చినపుడు అన్నిటికంటే ముందు థియేట‌ర్లు మూసేశారు.. కానీ అన్నిటికంటే చివ‌ర్లో థియేట‌ర్లు ఓపెన్ చేశారు. అదే సమయంలో ఎందుకు బార్లు, రెస్టారెంట్లకు కొంత సమయం ఇచ్చారంటూ ప్రశ్నించాడు నాని.

బార్స్, పబ్బులతో పోలిస్తే థియేటర్స్ సేఫ్ కదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. థియేటర్స్ అంటే ఎందుకంత చిన్నచూపు అని అడిగేసాడు. దాంతో పాటు నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతున్నాయి.. కానీ సినిమా టికెట్ రేట్లు మాత్రం త‌గ్గించ‌మంటున్నారు.. సినిమా అనేది ప్రభుత్వానికి చాలా చిన్న స‌మ‌స్య‌గా క‌నిపిస్తోందో ఏమో.. కానీ ఈ రంగం పై కూడా వేలాది కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలంటున్నాడు నాని. తన ‘ట‌క్ జ‌గ‌దీష్’ విడుదలకు ఉందని ఇదంతా చెప్పడం లేదు.. కచ్చితంగా బార్లు, రెస్టారెంట్‌లతో పోలిస్తే థియేటర్స్ సేఫ్ అంటున్నాడు.
nani,nani twitter,nani instagram,nani speech thimmarusu pre release event,nani questioning government,telugu cinema,నాని,నాని స్పీచ్,నాని తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్
నేచురల్ స్టార్ నాని (Nani)

అన్నింటితో సమానంగా థియేటర్లకు కూడా సడలింపులు ఇస్తే బాగుంటుంది అనేది తన అభిప్రాయం అంటూ చిన్పపాటి సంచలనమే రేపాడు నాని. అయితే ఈయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఎందుకంటే సినిమా అనేది ఎంతోమందికి అన్నం పెడుతుంది. మరి అలాంటపుడు దానిపై బతుకుతున్న పెద్దలు ఎందుకు ఈ విషయంపై నోరు విప్పడం లేదంటూ విమర్శుకుల ప్రశ్న. దీని గురించి నాని మాట్లాడినంత ధైర్యంగా ఎందుకు పెద్ద హీరోలు మాట్లాడలేకపోతున్నారు.. ప్రతీ చిన్న విషయానికి ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్లే ఇండ్ర‌స్ట్రీ పెద్లలు ఎందుకు ఈ విషయాన్ని హైలైట్ చేయలేకపోతున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు విమర్శకులు.

నానికి ఉన్న ధైర్యం వాళ్లకు లేదా అనేది వాళ్ల ప్రశ్న. నాని తన సినిమా కోసమే ఇదంతా మాట్లాడాడు అనుకోవడం కూడా అవివేకమే అవుతుంది. ఆయన సినిమా థియేటర్స్‌లో విడుదల కాకపోయినా కూడా ఓటిటిలో 40 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అసలు టికెట్స్, ఎగ్జిబిటర్స్ గురించి ఆయనకు అవసరం కూడా లేదు. కానీ అందరి సమస్య అంటూ దీన్ని తీసాడంటున్నారు విశ్లేషకులు. నాని చెప్పిన దానికి కనీసం కొందరైనా బయటికి వచ్చి సపోర్ట్ చేసుంటే బాగుండేది అనే వాదన వినిపిస్తుంది. మరి దీనిపై సో కాల్డ్ ఇండస్ట్రీ పెద్దలంతా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: