హోమ్ /వార్తలు /సినిమా /

Shyam Singha Roy - Nani : నాని ‘శ్యామ్ సింగరాయ్’ తమిళ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారు..

Shyam Singha Roy - Nani : నాని ‘శ్యామ్ సింగరాయ్’ తమిళ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారు..

‘శ్యామ్ సింగరాయ్’ తమిళ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారు (Twitter/Photo)

‘శ్యామ్ సింగరాయ్’ తమిళ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారు (Twitter/Photo)

Shyam Singha Roy - Nani : నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy)  ‘శ్యామ్ సింగ రాయ్’ పేరుతో ఓ పీరియాడిక్ డ్రామా మూవీ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా తమిళ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారైంది.

ఇంకా చదవండి ...

Shyam Singha Roy - Nani : నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy)  ‘శ్యామ్ సింగ రాయ్’ పేరుతో ఓ పీరియాడిక్ డ్రామా మూవీ చేసిన సంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఇక రిలీజ్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా యూనిట్ జోరు పెంచింది. 

‘శ్యామ్ సింగరాయ్’లో నాని టూ డిఫరెంట్ లుక్స్ లో నాని కనిపిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో మంచి ఆదరణ పొందుతోంది. తాజాగా ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. కోల్‌‌కత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సత్యదేవ్ జంగా కథ అందించారు. నాని కెరీర్‌లోనే తొలిసారి రూ.  40 కోట్లతో బడ్జెట్‌తో  తెరకెక్కింది.  ఈ చిత్రం. కచ్చితంగా అభిమానుల అంచనాలు నిలబెట్టేలాగే ఈ చిత్రం ఉంటుందని నాని కూడా నమ్మకంగా చెబుతున్నాడు.

Sridevi - Tamannaah - Kajal : శ్రీదేవి, తమన్నా, కాజల్ సహా తండ్రి కొడుకుల సరసన నటించిన హీరోయిన్స్ ఇంకెరున్నాంటే..


ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి, సెన్సేషనల్ సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు నాని. ఇప్పటికే ఎంసిఏ సినిమాలో కలిసి నటించిన నాని, సాయి పల్లవి శ్యామ్ సింగరాయ్ కోసం మరోసారి కలిసారు. ఇప్పటి వరకు సాయి పల్లవి చేయనటువంటి భిన్నమైన పాత్రను ఈ చిత్రంలో పోషిస్తుందని తెలుస్తుంది.

Rashmika Mandanna : ’పుష్ప’ ప్రమోషన్స్‌లో రెచ్చిపోయిన రష్మిక మందన్న.. క్లీవేజ్ షోతో మతులు పోగొట్టిన శ్రీవల్లి..


సాయి పల్లవి మూవీలో  బెంగాలీ దేవదాసీ అమ్మాయిగా నటించింది. . సాయి పల్లవి కారెక్టర్ పవర్ ఫుల్‌గా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీ ధర చెల్లించి దక్కించుకుందని తెలుస్తోంది. అయితే థియేటర్లలో సినిమా విడుదల అయిన అనంతరం నెట్ ఫ్లిక్స్ లో శ్యామ్ సింగ రాయ్  స్ట్రీమ్ కానుంది. దాదాపు 8 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్టు సమాచారం.

అబ్బాయి రానాతో కాకుండా.. మరో స్టార్ హీరోతో వెంకటేష్ మల్టీస్టారర్ మూవీ..

ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి గ్రాండ్‌గా నిర్మించారు.  మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం 30 కోట్లకు భారీ డీల్ జరిగిందని టాక్. దీంతో సినిమాకి పెట్టిన బడ్జెట్ లో 60 % రికవర్ అయిందని సమాచారం. మరోపక్క థియేట్రికల్ రైట్స్ కోసం కూడా భారీగానే ఆఫర్స్ వస్తున్నట్లు టాక్. ‘జెర్సీ’ తర్వాత సరైన సక్సెస్ లేని నానికి ‘శ్యామ్ సింగరాయ్’ సక్సెస్ కంపల్సరీ. ట్రైలర్ చూస్తుంటే.. ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా కనిపిస్తోంది. మరి చూడాలిక ఈ సినిమాతో నాని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా లేదా అనేది చూడాలి.

First published:

Tags: Kollywood, Krithi shetty, Nani, Sai Pallavi, Shyam Singha Roy, Shyam Singha Roy Movie Review, Tollywood

ఉత్తమ కథలు