Home /News /movies /

NATURAL STAR NANI SHYAM SINGHA ROY STREAM ON NETFLIX FROM JANUARY 21ST WITH TELUGU TAMIL MALAYALAM VERSIONS HERE ARE THE DETAILS TA

Shyam Singha Roy : నాని ‘శ్యామ్ సింగ రాయ్’ ఓటీటీ స్ట్రీమింగ్ పై అదిరిపోయే అప్‌డేట్..

నాని ‘శ్యామ్ సింగరాయ్’ స్ట్రీమింగ్ డేట్ (Twitter/Photo)

నాని ‘శ్యామ్ సింగరాయ్’ స్ట్రీమింగ్ డేట్ (Twitter/Photo)

Shyam Singha Roy : నాని ‘శ్యామ్ సింగ రాయ్’ ఓటీటీ స్ట్రీమింగ్ పై అదిరిపోయే అప్‌డేట్.. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళంతో పాటు మలయాళ వెర్షన్స్‌ను ఓకేసారి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

  Shyam Singha Roy OTT Streaming :  నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy)  ‘శ్యామ్ సింగ రాయ్’ అనే పీరియాడిక్ డ్రామా గతేడాది డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేద్దామనుకున్నారు. కానీ కుదరలేదు. ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లనే రాబట్టింది. థియేటర్స్ తక్కువుగా ఉన్నా స్థిరమైన కలెక్షన్స్‌తో అదరగొట్టింది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు అమెరికాలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఈ నెల 21 నెట్‌ప్లిక్స్  ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది.

  ‘శ్యామ్ సింగరాయ్’ మూవీని నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి ఓటీటీ రిలీజ్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్యామ్ సింగ రాయ్ జనవరి 21న శుక్రవారం రోజునుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు ఓ పోస్టర్‌ను విడుదల చేసారు.

  ఈ నెల 21న తెలుగు, తమిళం, మలయాళంలో నాని ‘శ్యామ్ సింగరాయ్’ స్ట్రీమింగ్ (Twitter/Photo)


  ఇక్కడ మరో విషయం ఏమంటే ఇదే రోజున బాలయ్య ‘అఖండ’ కూడా హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది.  ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీ ధర చెల్లించి దక్కించుకుందని తెలుస్తోంది. దాదాపు రూ. 8 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను పొందిందని అంటున్నారు. ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి ఎంతో గ్రాండ్‌గా నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా రూ. 50 కోట్లతో నిర్మించారు.

  Balakrishna - Ramesh Babu : ఎన్టీఆర్, కృష్ణ మధ్యే కాదు.. బాలకృష్ణ, రమేష్ బాబు మధ్య నడిచిన ఈ రచ్చ గురించి తెలుసా..

  ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ చిత్రం ఓవర్సీస్‌లో  8 లక్షల యూఎస్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి.. వన్ మిలియన్ మార్క్ వైపు దూసుకు వెళ్తోంది. కలకత్తా నగరం నేపథ్యంలో వింటేజ్ డ్రామాలా సాగిన ఈ శ్యామ్ సింగరాయ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 22.5 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగి ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాటలో నడుస్తోంది. మొత్తంగా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రూ. 27 కోట్ల షేర్ రాబట్టింది.

  Unstoppable with NBK : బాలయ్య అన్‌స్టాపబుల్‌ స్పెషల్‌ ఎపిసోడ్.. ఈ సారి రచ్చ ఓ రేంజ్‌లో..

  నాని ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో అలరించారు. ఈ చిత్రానికి సిరివెన్నెల పాటలు రాసారు. ఆయన పనిచేసిన చివరి సినిమా ఇది. ఏదేమైనా కూడా సరైన సమయంలో మంచి విజయం అందుకున్నాడు నాని. ఈ సినిమాతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అడల్ట్‌ కామెడీ జానర్‌లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

  Hero As Film Industry Based Movie : అశోక్ గల్లా ’హీరో’ మూవీ సహా తెలుగులో సినీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఇవే..

  ‘అంటే.. సుందరానికి’ సినిమాలో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్‌ నటిస్తున్నారు.  సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు. దీంతో పాటు నాని ప్రస్తుతం ‘దసరా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Nani, Netflix, Shyam Singha Roy, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు