Nani - Shyam Singha Roy: నాని దూకుడు మాములుగా లేదుగా.. ‘శ్యామ్ సింగరాయ్’ పూర్తి చేసిన నాచురల్ స్టార్..

నాచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ పూర్తి (Twitter/Photo)

Nani - Shyam Singha Roy | నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసారు. ఈ విషయాన్ని హీరో నానితో పాటు చిత్ర యూనిట్ తెలియజేసింది.

  • Share this:
    Nani - Shyam Singha Roy: నాని దూకుడు మాములుగా లేదుగా.. ప్రస్తుతం నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఎపుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో  పాటు నాని ‘అయితే సుందరానికి’ ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసారు. ఈ విషయాన్ని హీరో నానితో పాటు చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈ చిత్రాన్ని ‘టాక్సీవాలా’ ఫేమ్ డైరక్టర్ రాహుల్ డైరెక్షన్ చేశారు. ‘శ్యామ్ సింగ రాయ్’  పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించారు.  ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది శ్యామ్ సింగరాయ్. సాయి పల్లవి, కృతి శెట్టిలతో పాటు మరో టాలెంటెడ్ నటుడు నటిస్తున్నారు. బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగులో పలు చిత్రాల్లో నటించారు.  జిష్షు సేన్ గుప్తా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, నితిన్ భీష్మ, నాగ శౌర్య అశ్వాద్థామ సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

    ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా రూ. 50 కోట్లతో నిర్మిస్తున్నారు. దీనికి తోడు ఈ సినిమా ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం రూ. 30 కోట్లకు భారీ డీల్ జరిగిందని టాక్. దీంతో సినిమాకి పెట్టిన బడ్జెట్ లో 60 % రికవర్ అయిందని అంటున్నారు. మరోపక్క థియేట్రికల్ రైట్స్ కోసం కూడా భారీగానే ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు.



    ఇక నాని ఇతర సినిమాల విషయానికి వస్తే.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే సినిమా చేస్తున్నారు. మొదటి నుంచి మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య ఈ సినిమా ఫస్ట్ లుక్‌, టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆ పోస్టర్ ను చూస్తే మాత్రం ఓ క్లాస్ అండ్ పవర్ ప్యాక్డ్ గా ఉందని చెప్పొచ్చు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: