Home /News /movies /

NATURAL STAR NANI SHYAM SINGHA ROY CLOSING BOX OFFICE COLLECTIONS TA

Shyam Singha Roy : నాని ‘శ్యామ్ సింగరాయ్’ క్లోజింగ్ కలెక్షన్స్.. మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే..

నాని ‘శ్యామ్ సింగరాయ్’ క్లోజింగ్ కలెక్షన్స్ (Shyam Singha Roy on Netflix Photo :Twitter)

నాని ‘శ్యామ్ సింగరాయ్’ క్లోజింగ్ కలెక్షన్స్ (Shyam Singha Roy on Netflix Photo :Twitter)

Shyam Singha Roy OTT Streaming :  నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘శ్యామ్ సింగరాయ్’(Shyam Singha Roy) . టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ముగిసింది. టోటల్ కలెక్షన్స్ ఎంతంటే..

ఇంకా చదవండి ...
    Shyam Singha Roy OTT Streaming :  నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘శ్యామ్ సింగరాయ్’(Shyam Singha Roy) . టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వం వహించారు.  ఈ చిత్రాన్నిపీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన ఈఈ సినిమా  గతేడాది డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేద్దామనుకున్నారు. కానీ కుదరలేదు. ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లనే రాబట్టింది. థియేటర్స్ తక్కువుగా ఉన్నా స్థిరమైన కలెక్షన్స్‌తో అదరగొట్టింది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లో  కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఈ రోజు నెట్‌ప్లిక్స్  ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది.

    శ్యామ్ సింగ రాయ్ మూవీ ఈ రోజునుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా రూ. 19.67 కోట్లు షేర్ (రూ. 33.50 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఇక కర్ణాటక, మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్‌లో కలిపి రూ. 6.83 కోట్లు వసూళు చేసింది. ఓవరాల్‌గా థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయింది. ఈ సినిమా రూ. 26.50 కోట్ల షేర్ (రూ. 46.80 కోట్లు గ్రాస్) వసూళ్లను  రాబట్టింది. ఈ సినిమా రూ. 22.5 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగి రూ. 4 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

    Samantha : విడాకుల తర్వాత సమంత మరో షాకింగ్ డెసిషన్.. సామ్ చేసిన పనికి అక్కినేని ఫ్యాన్స్ డైలామా..


    ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి ఎంతో గ్రాండ్‌గా నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా రూ. 50 కోట్లతో నిర్మించారు. నాని ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో అలరించారు. ఈ చిత్రానికి సిరివెన్నెల పాటలు రాసారు. ఆయన పనిచేసిన చివరి సినిమా ఇది. ఏదేమైనా కూడా సరైన సమయంలో మంచి విజయం అందుకున్నాడు నాని. ఈ సినిమాతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అడల్ట్‌ కామెడీ జానర్‌లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

    Dulquer Salmaan Corona Positive : కరోనా బారిన పడ్డ మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్..


    ‘అంటే.. సుందరానికి’ సినిమాలో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్‌ నటిస్తున్నారు.  సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు. దీంతో పాటు నాని ప్రస్తుతం ‘దసరా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Box Office Collections, Nani, Shyam Singha Roy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు