NATURAL STAR NANI SHYAM SINGHA ROY 13 DAYS TOTAL WORLD WIDE COLLECTIONS TA
Shyam Singha Roy 13 days collections : నాని ‘శ్యామ్ సింగరాయ్’ 13 రోజుల వసూళ్లు.. మొత్తంగా ఎంత రాబట్టిందంటే..
నాని ‘శ్యామ్ సింగరాయ్’ 13 రోజుల వసూళ్లు (Instagram/Photo)
Shyam Singha Roy 13 days World Wide collections : నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’. ఈ మూవీ 13 రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే..
Shyam Singha Roy 12 days World Wide collections : నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’. దాదాపు రెండేళ్ళ తర్వాత నాని హీరోగా నటించిన మూవీ థియేటర్స్‌లో విడుదలైంది. గతేడాది చివర్లో విడుదలై మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ మూవీలో నాని (Natural Star Nani ) టూ డిఫరెంట్ పాత్రల్లో ఆకట్టుకున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. పునర్జన్మల కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పర్లేదు అనే రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు కొంత మంది మనోభావాలు దెబ్బ తీసారనే వ్యాఖ్యలు మినహా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబడుతోంది. హీరోగా నాని మరోసారి అదరగొట్టాడు.. సాయి పల్లవి (Sai Pallavi) కూడా తన పాత్రలో ఆకట్టుకుంది. కృతి శెట్టి (Krithi Shetty) ఉన్నంతలో గ్లామర్‌లో అలరించింది.
పైగా పునర్జన్మలకు లింక్ బాగానే కుదరడం.. క్లైమాక్స్ సీన్ బాగా పేలడంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. 13వ రోజు ఏపీ, తెలంగాణలోనే రూ. 12 లక్షల షేర్ రాబట్టింది. మొత్తంగా చూస్తే ఈ కలెక్షన్స్ పెద్దగా ఇరగదీసింది లేదు. శ్యామ్ సింగరాయ్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 13 రోజుల్లో దాదాపు రూ. 25.12 కోట్లు షేర్ వసూలు చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమాను తక్కువ రేటుకు అమ్మడంతో ఏదో సేఫ్ అయింది చెప్పాలి. ఐనా రావాల్సిన దానికంటే తక్కువగానే వస్తున్నాయి వసూళ్లు.
‘శ్యామ్ సింగరాయ్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నాని గత సినిమాలతో పోలిస్తే ఇది తక్కువే. కానీ ఈయన నటించిన గత రెండు సినిమాలు ఫ్లాప్ కావడం.. థియేటర్స్‌కు రెండేళ్ల తర్వాత రావడంతో బిజినెస్ తక్కువగానే చేసారు దర్శక నిర్మాతలు. . సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సిరివెన్నెల పాటలు రాసారు. ఆయన పనిచేసిన చివరి సినిమా ఇది. మొత్తంగా చూసుకుంటే.. 13వ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 17 లక్షల వసూళ్లు సాధించింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.