ఒకే ఫ్రేములో ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, రానా, నాని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్..

ఒకే ఫ్రేములో రామ్ చరణ్, ప్రభాస్, రానా, నాని, ఎన్టీఆర్ (Instagram/Photo/Nani)

RRR - Bahubali Stars Jr NTR Prabhas Ram Charan Rana Nani |  ఒకే ఫ్రేములో ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, రానా, నాని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్..

 • Share this:
  RRR - Bahubali Stars Jr NTR Prabhas Ram Charan Rana Nani |  ఒకే ఫ్రేములో ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, రానా, నాని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్.. ఈ ఆదివారం వాల్డ్ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకండా అన్ని ఇండస్ట్రీస్ హీరోలు తమ స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో నాని కూడా ఆర్ఆర్ఆర్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు బాహుబలి స్టార్స్ ప్రభాస్, రానాలతో కలిసి దిగిన పాత ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఇపుడీ ఫోటోలను ఆయా హీరోల అభిమానులు సోసల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

  ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలో తన ఆప్తులు అంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, రానాలను నాని పేర్కొనడం విశేషం. ఒకే ఫ్రేములో స్టార్ హీరోలందరు కలిసి కనువిందు చేసిన ఈ ఫోటో ట్రెండ్ అవుతోంది.
  ఇక  ఈ ఫోటో రాజమౌళి కుమారుడు కార్తికేయ వెడ్డింగ్ సందర్భంగా రాజస్థాన్‌లో దిగినది. దీంతో పాటు నాని..వివిధ సందర్భాల్లో తన స్నేహితులతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. నాని విషయానికొస్తే.. ఈయన హీరోగా యాక్ట్ చేసిన ‘టక్ జగదీష్’ విడుదలకు రెడీగా ఉంది. మరోవైపు కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా కంప్లీట్ కానీకొచ్చింది. మరోవైపు ‘అంటే సుందరానికి’ సినిమా చేయనున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: