ఒకప్పుడు నాని వరస సినిమాలు చేసేవాడు. కానీ ఈ మధ్య కాస్త జోరు తగ్గించాడు. వరస ఫ్లాపులు వచ్చేసరికి కథల విషయంలో మరింత కాన్సట్రేట్ చేస్తున్నాడు నేచురల్ స్టార్. అయితే స్టార్ డైరెక్టర్స్‌ను నమ్ముకునే కంటే కూడా కథ, కథనం బాగా పట్టున్న కొత్త దర్శకులతో సినిమాలు చేయడం నయం అనుకుంటున్నాడు ఈయన. అందుకే క్రేజీ దర్శకులను కాకుండా ఒకట్రెండు సినిమాల అనుభవం ఉన్న వాళ్లతోనే ఎక్కువగా కానిచ్చేస్తున్నాడు. ఇప్పుడు నాని నటిస్తున్న మూడు సినిమాలకు కూడా అలాంటి దర్శకులే పని చేస్తున్నారు. టక్ జగదీష్ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఈయనకు రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉంది. నిన్ను కోరి, మజిలి సినిమాలతో విజయాలు అందుకున్న ఈయన.. ఇప్పుడు టక్ జగదీష్‌తో హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఎప్రిల్ 16, 2021లో విడుదల కానుంది ఈ చిత్రం. ఈ మధ్యే విడుదలైన ఫస్ట్ లుక్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇందులో జగదీష్ నాయుడుగా నటిస్తున్నాడు నాని.

నాని ‘అంటే సుందరానికీ’ (Twitter/Photo)
మరోవైపు ఈ సినిమాతో పాటు శ్యామ్ సింగ రాయ్ సినిమా కూడా చేస్తున్నాడు నాని. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. 2021 ఆగస్ట్‌లో శ్యామ్ సింగ రాయ్ విడుదలయ్యేలా కనిపిస్తుంది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంక్రీత్యన్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి, ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మరి సుందరానికి అంటూ వివేక్ ఆత్రేయతో కూడా ఓ సినిమాకు కమిటయ్యాడు. ఈ సినిమా 2021 డిసెంబర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.

శ్యామ్ సింగ రాయ్ Photo : Twitter
2017లో ఇలాగే మూడు సినిమాలతో వచ్చాడు నాని. ఏడాది మొదట్లో నేను లోకల్.. మధ్యలో నిన్నుకోరి.. చివర్లో ఎంసిఏ.. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టాయి. ఇప్పుడు 2021లో కూడా సేమ్ సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు నేచురల్ స్టార్. మరి ఆయన కోరిక 2021 ఎంతవరకు తీరుస్తుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:January 24, 2021, 20:11 IST