Sree Vishnu - Bhala Thandhanana Teaser Talk | టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. తను మాత్రమే చేయగల విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇటీవల ఆయన నటించిన కొన్ని సినిమాలను పెద్దగా అలరించలేకపోయాయి. ఇక శ్రీ విష్ణు నుంచి సినిమా వస్తుందంటే.. ఏదో కొత్త తరహాగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో పాతుకపోయింది. గతేడాది ‘గాలి సంపత్’ ‘రాజ రాజ చోర’తో పాటు గతేడాది చివర్లో ‘అర్జున ఫల్గుణ’ చిత్రంతో ప్రేక్షకులు ముందకు వచ్చారు. తాజాగా ఈయన ‘భళా తందనాన’ సినిమాతో ఆడియన్స్ ముందకు రానున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇపుడు ఈ సినిమా టీజర్‌ను నాని విడుదల చేసారు. ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.
‘భళా తందనాన’ టీజర్ విషయానికొస్తే.. రాక్షసుడిని చంపడానికి కూడా దేవుడు అవతారం ఎత్తాలి కానీ.. నేను మాములు మనిషిని అంటూ టీజర్ స్టార్ట్ అవుతోంది. ఈ మూవీలో శ్రీ విష్ణు నిజాయితీ గల జర్నలిస్ట్ పాత్రలో నటించారు. నిజాయితీగా ఉండాలనుకుంటే.. ఈ దేశంలో కామన్ మ్యాన్‌కు కూడా రిస్కే.. సీఎం కుర్చీలో ఎవరైనా.. ఒక్క సంతకంతో స్టేట్ ఫ్యూచర్‌నే మార్చేయవచ్చు. ఆ పవర్ చేతిదా.. కుర్చీదా అనే డైలాగులు బాగున్నాయి. మరోసారి శ్రీ విష్ణు ఇంటెన్సివ్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.
Presenting you the teaser of#BhalaThandhanana?️?️#BhalaThandhananaTeaserhttps://t.co/p6pQxJi347@sreevishnuoffl @chaitanyahead @CatherineTresa1 @SaiKorrapati_ #ManiSharma @GarudaRaam @SrikanthVissa @dopsureshragutu @PeterHeinOffl @VaaraahiCC pic.twitter.com/0t0YHRm9fu
— BA Raju's Team (@baraju_SuperHit) January 28, 2022
ఈ సినిమాను చైతన్య దంతలూరి డైరెక్ట్ చేసారు. వారాహీ చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్ఫణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన కేథరిన్ నటించింది.ఈ సినిమాతో శ్రీ విష్ణుకు మంచి విజయం దక్కేలా కనిపిస్తోంది.
Prabhas - Adipurush : ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రపంచ రికార్డు.. ఇది కదా రెబల్ స్టార్ రేంజ్..
శ్రీ విష్ణు విషయానికొస్తే.. నారా రోహిత్ హీరోగా నటించిన ‘బాణం’ సినిమాతో నటుడిగా పరిచయమైన ఈయన.. ఆ తర్వాత ‘సోలో’, ‘లవ్ ఫెయిల్యూర్’, ‘నా ఇష్టం’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఇక ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో రాయల్ రాజు పాత్ర శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా ‘సెకండ్ హ్యాండ్’, ‘అసుర’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘ప్రతినిధి’ చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఇక నారా రోహిత్‌తో కలిసి సాగర్ చంద్ర దర్శకత్వంలో నటించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం హీరోగా బ్రేక్ ఇచ్చింది.
RRR : ఆ హీరో ఎఫెక్ట్ .. రాజమౌళి ఆర్ఆర్ఆర్ విడుదలయ్యేది ఆరోజే..
ఆ తర్వాత హీరోగా నటిస్తూనే.. రామ్‌తో కలిసి ‘ఉన్నది ఒకటే జిందగీ’ శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘మెంటల్ మదిలో’, ’నీది నాది ఒకే కథ’, ‘వీర భోగ వసంతరాయలు’, ‘బ్రోచేవారేవురా’, ‘తిప్పరా మీసం’ వంటి చిత్రాలు శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చాయి. గతేడాది వరుసగా ‘గాలి సంపత్’, ‘రాజ రాజ చోళ’ ‘అర్జున ఫల్గుణ’ చిత్రాలతో పలకరించారు. ఈ సినిమాలు కమర్షియల్‌గా ఫెయిల్ అయనా.. నటుడిగా శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా ‘భళా తందనాన’ చిత్రంతో పలకరించబోతున్నారు. ఈ చిత్రంతో శ్రీ విష్ణు మరో సక్సెస్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhala Thandhanana, Sree Vishnu, Tollywood