• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NATURAL STAR NANI PLANNING TO COMPLETE SHYAM SINGHA ROY ANTE SUNDARANIKI MOVIES ONCE AT A TIME IN COVID SITUATIONS PK

Natural Star Nani: నాని మామూలోడు కాడు.. కరోనాలోనూ ఆ పని చేస్తున్న నేచురల్ స్టార్..

Natural Star Nani: నాని మామూలోడు కాడు.. కరోనాలోనూ ఆ పని చేస్తున్న నేచురల్ స్టార్..

నాని టక్ జగదీష్ (Nani Tuck Jagadish)

Natural Star Nani: హిట్టు ఫ్లాపులతో పని లేకుండా టాలీవుడ్‌లో ఎప్పుడూ బిజీగా ఉండే హీరో నేచురల్ స్టార్ నాని(Nani). ఇప్పుడు కూడా ఈయన మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే కరోనా నేపథ్యంలో కూడా ఈయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. దానికి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

  • Share this:
హిట్టు ఫ్లాపులతో పని లేకుండా టాలీవుడ్‌లో ఎప్పుడూ బిజీగా ఉండే హీరో నేచురల్ స్టార్ నాని. ఈయన చేతిలో కనీసం ఎప్పుడూ మూడు సినిమాలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఈయన మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే టక్ జగదీష్ విడుదలకు సిద్ధంగా ఉంది. పరిస్థితులు బాగుండుంటే ఎప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చుండేది ఈ చిత్రం. కానీ కరోనా కారణంగా మరోసారి వాయిదా పడింది. పోనీ ఓటిటిలో విడుదల చేద్దామా అంటే ఇంద్రగంటి మోహనకృష్ణ వి సినిమా ఇచ్చిన షాక్ ఇంకా మరిచిపోలేకపోతున్నారు నాని. తన 25వ సినిమా ఇంత దారుణంగా ఫ్లాప్ అవుతుందని ఆయన కూడా ఊహించలేదు. దాంతో పరిస్థితులు చక్కబడే వరకు టక్ జగదీష్ బాక్సుల్లోనే ఉంటాడు. దీంతో పాటు మరో మూడు సినిమాలు చేస్తున్నారు. నాని. అందులో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్‌తో చేస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం నాని కెరీర్‌లోనే హైయ్యస్ట్ బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు. 40 కోట్లకు పైగా బడ్జెట్‌తో కోల్‌కత్తా నేపథ్యంలో సినిమా వస్తుంది. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. ఇందులో కోరమీసంతో కనిపిస్తున్నారు నాని. ప్రస్తుతం ఈయన బయట కనిపిస్తున్న లుక్ కూడా ఇదే. శ్యామ్ సింగ రాయ్ నాన్ థియెట్రికల్ రైట్స్ దాదాపు 30 కోట్ల వరకు వచ్చాయని తెలుస్తుంది.
nani,nani twitter,nani movies,nani shyam singha roy movie,nani ante sundaraniki movie,nani tuck jagadish movie,nani movies shooting,nani covid shooting,telugu cinema,నాని,నాని సినిమాలు,నాని టక్ జగదీష్,నాని శ్యామ్ సింగ రాయ్ షూటింగ్,నాని అంటే సుందరానికి షూటింగ్
నాని శ్యామ్ సింగ రాయ్ (Nani Shyam Singha Roy)

బడ్జెట్‌లో దాదాపు 60 శాతం రికవరీ కూడా అయిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాతో పాటు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న అంటే సుందరానికి సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో వరస విజయాలు అందుకున్న వివేక్ ఆత్రేయ.. నానితో క్రేజీ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో తెలుగులో నజ్రియా నజీమ్ ఎంట్రీ ఇస్తున్నారు.
nani,nani twitter,nani movies,nani shyam singha roy movie,nani ante sundaraniki movie,nani tuck jagadish movie,nani movies shooting,nani covid shooting,telugu cinema,నాని,నాని సినిమాలు,నాని టక్ జగదీష్,నాని శ్యామ్ సింగ రాయ్ షూటింగ్,నాని అంటే సుందరానికి షూటింగ్
నాని అంటే సుందరానికి (Nani Ante Sundaraniki)

అయితే బయట ఇంత దారుణంగా కరోనా ఉన్నా కూడా ఈయన మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఒకేసారి రెండు సినిమాలను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు నేచురల్ స్టార్. ఈ రెండు చిత్ర యూనిట్స్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలా ఈ రెండు సినిమాలను కూడా ఏక కాలంలోనే పూర్తి చేయాలని డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు నాని.
Published by:Praveen Kumar Vadla
First published: