Home /News /movies /

NATURAL STAR NANI NEXT PRODUCTION HIT2 HERO AND HEROINE CONFIRMED DETAILS HERE MHN

Natural Star Nani - Hit2: ‘హిట్ 2’ హీరో, హీరోయిన్‌ని ఫిక్స్ చేసిన నాని.. వివ‌రాలు మీ కోసం

Natural Star Nani next production Hit2 hero and heroine confirmed details here

Natural Star Nani next production Hit2 hero and heroine confirmed details here

Natural Star Nani - Hit2: నాని నిర్మాత‌గా మారి రూపొందించ‌నున్న ‘హిట్ 2’ సినిమాలో హీరో, హీరోయిన్ ఎవ‌ర‌నే వివ‌రాలు మీకోసం

    నాని నిర్మాతగా మారి రూపొందించిన రెండో చిత్రం ‘హిట్ 2’. పేరుకు తగ్గట్లే పెద్ద హిట్ అయ్యింది. గత ఏడాది కోవిడ్ కార‌ణంగా మార్చి నుంచి సినిమాలు లేవు. విడుద‌లై విజ‌యం సాధించిన అతి కొద్ది సినిమాల్లో ‘హిట్’ సినిమా కూడా ఒక‌టి. పోలీస్ శాఖ‌లోని క్రైమ్ టీమ్‌ హోమిసైడ్‌ ఇంటర్‌వెన్షన్‌ టీమ్‌ కేసులను ఎలా పరిష్కరిస్తుందనే ఓ ఆలోచనతో దర్శకుడు శైలేంద్ర కొలను రాసుకున్నకథ ఇది. విష్వక్ సేన్ హీరోగా రూపొందిన చిత్రం `హిట్‌`. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. రీసెంట్‌గానే హీరో నాని, తాను నిర్మించ‌బోయే ‘హిట్ 2’ గురించి వివ‌రాల‌ను తెలియ‌జేశాడు.

    అయితే హిట్ సినిమానుసీక్వెల్ స్టైల్లో కాకుండా ఫ్రాంచైజీలా తెర‌కెక్కించ‌డానికి నాని డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగా ‘హిట్ 2’లో హీరో, హీరోయిన్‌ను మార్చేశాడు. ఈసారి ‘హిట్ 2’ సినిమా ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే క్రైమ్ డ్రామా అని హింట్ ఇచ్చేశాడు నాని. హీరో పేరు కూడా కె.డి అని చెప్పేశాడు. ఆ కె.డి ఎవ‌రో క‌నుక్కోవాల‌ని చెప్పాడు. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో కె.డి అనే హీరో పాత్ర‌లో అడివిశేష్ న‌టించ‌బోతున్నాడు. హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుంది. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం మాస్ మ‌హారాజ ర‌వితేజ ‘ఖిలాడి’లో హీరోయిన్‌గా న‌టించింది.

    ఏప్రిల్ నుంచి ‘హిట్ 2’ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. హిట్ మూవీ స‌క్సెస్ ఆటోమేటిక్‌గా ‘హిట్ 2’పై అంచ‌నాల‌ను పెంచేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌రి డైరెక్ట‌ర్ శైలేష్ సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.
    Published by:Anil
    First published:

    Tags: Adivi Sesh, Nani, Vishwak Sen

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు