హోమ్ /వార్తలు /సినిమా /

జెర్సీతో హిట్ కొట్టేసిన నాని..అసలు సినిమాలో ఏముందంటే...

జెర్సీతో హిట్ కొట్టేసిన నాని..అసలు సినిమాలో ఏముందంటే...

జెర్సీ సినిమా పోస్టర్ Photo: Twitter

జెర్సీ సినిమా పోస్టర్ Photo: Twitter

నాచురల్ స్టార్..నాని ఓ సినిమాను చేస్తున్నాడంటే.. ఆ సినిమాలో..ఏదో ప్రత్యేకత ఉంటుందని భావిస్తున్నారు..ప్రేక్షకులు. దానికి కారణం..ఆయన గతంలో చేసిన విభిన్నమైన సినిమాలే.

    నాచురల్ స్టార్..నాని ఓ సినిమాను చేస్తున్నాడంటే.. ఆ సినిమాలో..ఏదో ప్రత్యేకత ఉంటుందని భావిస్తున్నారు..ప్రేక్షకులు. దానికి కారణం..ఆయన గతంలో చేసిన విభిన్నమైన సినిమాలే. ఉదాహరణకు..ఆయన హీరోగా వచ్చిన.. భలే భలే మగాడివోయ్. ఈ సినిమాలో నాని..మతిమరుపు పాత్రలో.. ఎంతో నాచురల్‌గా నటిస్తూ..కొంత హాస్యాన్ని పండించిన..కొన్ని సీన్లలో ఏడిపించేస్తాడు. ఆ ఒక్క సినిమానే కాదు..ఆ మద్య వచ్చిన..MCAలో కూడా పక్కింటి అబ్బాయిగా మైమరింపించాడు. అలా సాదారణమైన జీవితాలకు సంబందించిన పాత్రలను చేస్తూ.. తన నటన ద్వారా..తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయాడు.అయితే.. ఇటీవల కొన్ని సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేసిన..ఆయన తాజా సినిమా జెర్సీతో మరోసారి..ముందుకోచ్చాడు.


    జెర్సీ సినిమా పోస్టర్ Photo: Twitter
    జెర్సీ సినిమా పోస్టర్ Photo: Twitter


    గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ  సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించింది.  కథ విషయానికి వస్తే.. న్యూయార్క్ సిటీలో అర్జున్‌ (సినిమాలో పెద్ద నాని పేరు)  కుమారుడు.. తన తండ్రి( అర్జున్) లైఫ్ గురించి న్యారెేట్ చేస్తుండగా.. సినిమా ప్రారంభం అవుతుంది.హైదరాబాద్ క్రికెట్‌లో మంచి ఫామ్‌లో ఉన్న నాని.. క్రిస్టియన్ అమ్మాయి సారాను ప్రేమించి,పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత నుండి.. నాని  ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిన్నంటిని ఎదుర్కోనేందుకు.. తిరిగి 36 ఏళ్ల తర్వాత మళ్లీ బ్యాట్ పడుతాడు నాని. ఎలాగైనా క్రికెట్ ఆడాలన్న కసితో సాధన చేస్తాడు. అయితే.. ఆ ప్రయత్నంలో.. నాని ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ? తన లక్ష్యాన్ని చేరుకున్నాడా ? లేదా ?  అనేది సినిమా..


    జెర్సీ సినిమా పోస్టర్ Photo: Twitter
    జెర్సీ సినిమా పోస్టర్ Photo: Twitter


    ఈ సినిమాలో క్రికెట్ మ్యాచ్‌లను దర్శకుడు చాలా సహజంగా..తీశాడు. సినిమాలో  మ్యాచ్‌లను చూస్తుంటే.. రియల్‌‌గా చూస్తున్నట్టే ఉన్నాయి. దీనికి నాని శ్రమను కూడా అభినందించాల్సిందే. అంతే కాకుండా.. నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఇరగదీశారు. ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకుడిని కట్టి పడేస్తోంది. దీనికి తోడు అనిరుధ్ పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. అయితే సినిమా రన్ టైం కాస్తా.. ఎక్కువ ఉండడంతో.. సినిమా కొంత స్లోగా సాగుతున్న ఫీల్ వస్తోంది.  ఓవరాల్‌గా జెర్సీ..మంచి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా చెప్పోచ్చు.

    First published:

    Tags: Jersey movie review, Nani, Shraddha Srinath, Telugu Cinema News, Telugu Movie News

    ఉత్తమ కథలు