హోమ్ /వార్తలు /సినిమా /

Nani - Dasara : ‘దసరా’ మూవీ నుంచి నాని లుక్ విడుదల.. కెవ్వు కేక పుట్టించేలా నాచురల్ స్టార్ లుక్..

Nani - Dasara : ‘దసరా’ మూవీ నుంచి నాని లుక్ విడుదల.. కెవ్వు కేక పుట్టించేలా నాచురల్ స్టార్ లుక్..

Nani - Dasara : నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లెేటస్ట్ మూవీ ‘దసరా’. ఎపుడో అనౌన్స్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేశారు.

Nani - Dasara : నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లెేటస్ట్ మూవీ ‘దసరా’. ఎపుడో అనౌన్స్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేశారు.

Nani - Dasara : నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లెేటస్ట్ మూవీ ‘దసరా’. ఎపుడో అనౌన్స్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేశారు.

  Nani - Dasara :  గత యేడాది నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన  మూవీ ‘శ్యామ్ సింగరాయ్’.(Shyam Singha Roy )మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. అంతకు ముందు నాని నటించిన రెండు చిత్రాలు ‘వీ’(V), ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత నాని నటించిన సినిమా థియేటర్స్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా నాని  కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)  అనే కొత్త దర్శకుడుతో ‘దసరా’ సినిమాన చేస్తున్నారు. రీసెంట్‌గా పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభమైంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.  నాని హీరోగా నటించిన ‘దసరా’ సినిమాను విజయ దశమి రోజున ప్రకటించారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో నటిస్తున్నారు.  సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్‌ ఓదేల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

  దసరా’ సినిమాకు తెలంగాణకు చెంిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. . కీర్తి ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సర్కారు వారి పాటలో నటిస్తున్నారు. అది అలా ఉంటే ఈ సినిమాలో రెండో హీరోయిన్‌కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం సమంతను తీసుకుంటున్నారట. అందులో భాగంగా ఆమెను చిత్రబృందం ఇప్పటికే కలిసిందని.. ఆమె కూడా ఓకే చెప్పిందని అంటున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేశారు. లుంగీతో మాసీవ్‌గా ఉన్న నాని లుక్‌కు టెర్రిఫిక్‌గా ఉంది. దాంతో  పాటు  ఈ సినిమా స్పార్క్ అంటూ టీజర్ లాంటిది విడుదల చేశారు. నోటిలో బీడీతో పూర్తి మాస్ లుక్‌లో నాని లుక్ కేక పుట్టిస్తోంది.

  ‘పుష్ప’లో అల్లు అర్జున్ డిఫరెంట్‌ లుక్‌లో ఎలా మెస్మరైజ్ చేసారో.. నాని లుక్ అదే విధంగా టెర్రిఫిక్‌గా ఉంది.  ఈ లుక్‌  ఈ సినిమాపై అంచనాలు పెంచేసాడు నాని. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై భారీగా ఎత్తున సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

  ' isDesktop="true" id="1240498" youtubeid="GT7th52DKj0" category="movies">

  తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ యువకుడి పాత్ర కోసం ఇక్కడి యాసపై పట్టుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ని కూడా నియమించుకున్నాడట నాని.

  RRR Pre Relese Event : రామ్ చరణ్ నా రాముడు.. ఎన్టీఆర్ నా భీముడు.. ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి..

  ప్రస్తుతం నాని నటించిన ‘అయితే సుందరానికి’ సినిమాను జూన్ 10వ తేదిన విడుదల చేస్తున్నట్టు  ప్రకటించనున్నారు. ఈ సినిమాలో నాని బ్రాహ్మణ యువకుడి పాత్రలో కనిపించనున్నారు.  ధసరాతో పాటు నాని చేతిలో పలు చిత్రాలన్నాయి. వీటిని కూడా త్వరలో అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.  ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్  ఆగష్టు వరకు కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు దర్శక, నిర్మాతలు.  అంతేకాదు ‘దసరా’ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

  First published:

  Tags: Dasara Movie, Keerthy Suresh, Nani, Tollywood

  ఉత్తమ కథలు