‘జెర్సీ’ ట్రైలర్.. న్యాచురల్ స్టార్ నాని అద్భుతమైన ఎమోషనల్ జర్నీ..

కొన్ని సినిమాలపై ముందు నుంచి ఏదో తెలియని ఆసక్తి.. అంచనాలుంటాయి. ఇప్పుడు జెర్సీ కూడా అంతే. వరసగా రెండు ఫ్లాపుల తర్వాత నాని నటిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్రిల్ 19న విడుదలకు సిద్ధం అయింది జెర్సీ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 12, 2019, 1:08 PM IST
‘జెర్సీ’ ట్రైలర్.. న్యాచురల్ స్టార్ నాని అద్భుతమైన ఎమోషనల్ జర్నీ..
నాని జెర్సీ న్యూ పోస్టర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 12, 2019, 1:08 PM IST
కొన్ని సినిమాలపై ముందు నుంచి ఏదో తెలియని ఆసక్తి.. అంచనాలుంటాయి. ఇప్పుడు జెర్సీ కూడా అంతే. వరసగా రెండు ఫ్లాపుల తర్వాత నాని నటిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్రిల్ 19న విడుదలకు సిద్ధం అయింది జెర్సీ. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఎమోషనల్ జర్నీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఆగి ఓడిపోయేవాడు ఉన్నాడు.. కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు మాత్రం లేడు. ఈ ఒక్క డైలాగ్ చెబుతుంది నాని సినిమా కథ ఎలా ఉండబోతుందో.

Natural Star Nani Jersey Trailer.. Emotional Journey of a Talented Cricketer pk.. కొన్ని సినిమాలపై ముందు నుంచి ఏదో తెలియని ఆసక్తి.. అంచనాలుంటాయి. ఇప్పుడు జెర్సీ కూడా అంతే. వరసగా రెండు ఫ్లాపుల తర్వాత నాని నటిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్రిల్ 19న విడుదలకు సిద్ధం అయింది జెర్సీ. nani jersey,nani jersey movie,nani jersey movie trailer released,nani jersey trailer review,jersey trailer positive response,nani jersey trailer,gowtam tinnanuri nani movie,nani cricketer,nani telugu cinema,జెర్సీ ట్రైలర్,జెర్సీ ట్రైలర్ విడుదల,నాని,నాని గౌతమ్ తిన్ననూరి,జెర్సీ ట్రైలర్ సూపర్ రెస్పాన్స్,తెలుగు సినిమా
జెర్సీ మూవీ సాంగ్


1980ల్లో సాగే కథ ఇది.ఇండియన్ క్రికెట్ టీంలోకి రావాలని కలలుకనే ఓ ఆటగాడి కథ ఇది. అప్ప‌టికే 36 ఏళ్లు రావ‌డంతో అంతా జీవితంలో ఓడిపోయావు అని.. ఏం సాధించ‌లేవు అంటూ నిరుత్సాహ‌ప‌రుస్తుంటారు. అప్పుడు హీరో ఎలా అనుకున్న‌ది సాధించాడు అనేది ఇన్స్ స్పిరేష‌న‌ల్ గా తీస్తున్నాడు ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి. మళ్ళీరావా సినిమాతో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న ఈయ‌న‌.. రెండో సినిమాకే న్యాచురల్ స్టార్‌ను పట్టుకున్నాడు. సితార‌ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ అదిరిపోవడంతో చిత్రయూనిట్ ఆనందంగా ఉన్నారు.
నాని ఇందులో క్రికెటర్‌గా నటిస్తుండడం విశేషం. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు న్యాచురల్ స్టార్. జీవితంలో ఫెయిల్ అవుతున్నావంటూ అంతా వేలెత్తి చూపించే పాత్రలో నటిస్తున్నాడు నాని. వరుసగా ఫేల్ అవుతూ చివరికి ఇండియన్ టీంలోకి ఎలా సెలెక్ట్ అయ్యాడు.. అయిన‌ తర్వాత ఎలా నెగ్గుకొచ్చాడు అనేది ఈ చిత్ర కథ. వినడానికి ఎమోషనల్ గా ఉంది జెర్సీ కథ. వరుసగా రెండు పరాజయాలతో రేసులో వెనకబడిపోయిన నానికి ఈ సినిమా విజయం కీలకంగా మారింది. మరి ఏం జరుగుతుందో.. జెర్సీ ఏం చేస్తుందో చూడాలి.
First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...