నాని హీరోగా ఈ ఏడాది విడుదలైన సినిమా జెర్సీ. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రశంసల వర్షం కురిసింది. చనిపోతూ కూడా గెలిచే ఓ ఆటగాడి కథ ఇది. ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. దీనిపై చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నా కూడా ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఇక ఇప్పుడు జెర్సీ సినిమా హిందీ రీమేక్‌కు రంగం సిద్ధమైంది. కబీర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న షాహిద్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు.
ముందు రణ్వీర్ సింగ్ అనుకున్నా కూడా ఇప్పటికే 83 సినిమాను రీమేక్ చేస్తున్నాడు కాబట్టి మళ్లీ క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు. దాంతో ఇప్పుడు నాని సినిమాలోకి షాహిద్ కపూర్ వచ్చాడు. ఈ సినిమాను తెలుగు నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం. ఈ ఇద్దరితో పాటు ఆమన్ గిల్ కూడా జత కలుస్తున్నాడు.
ఇక తెలుగులో ఈ సినిమాను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. 2020 ఏప్రిల్‌లో జెర్సీ హిందీ రీమేక్ విడుదల చేయాలని చూస్తున్నారు. మొత్తానికి ఇద్దరు తెలుగు నిర్మాతలు, ఓ తెలుగు దర్శకుడు కలిసి జెర్సీని హిందీ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. మరి అక్కడ ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తుందో చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jersey movie review, Nani, Shahid Kapoor, Telugu Cinema, Tollywood