హోమ్ /వార్తలు /సినిమా /

సమ్మర్ రేస్‌లో దూసుకెళ్తున్న నాని, వెనుకబడిన నాగ చైతన్య, సాయి తేజ్

సమ్మర్ రేస్‌లో దూసుకెళ్తున్న నాని, వెనుకబడిన నాగ చైతన్య, సాయి తేజ్

జెర్సీలో నాని Photo: Twitter

జెర్సీలో నాని Photo: Twitter

నాచురల్ స్టార్.. నాని, గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో వచ్చిన జెర్సీ.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమా సూపర్ ఓపెనింగ్స్‌తో అదరగొట్టే కలెక్షన్స్‌ను రాబడుతోంది.

నాచురల్ స్టార్.. నాని, గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో వచ్చిన జెర్సీ.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమా సూపర్ ఓపెనింగ్స్‌తో అదరగొట్టే కలెక్షన్స్‌ను రాబడుతోంది. దీనికి తోడు..పిల్లలకు సమ్మర్ హాలీడేస్ తొడవ్వడంతో..జెర్సీ మన్ముందు కలెక్షన్స్‌లలో రికార్డ్స్ సృష్టించనుందని అంటున్నారు, సినీ పండితులు. అది అలా ఉంటే, ఈమధ్యనే విడుదలైన నాగ చైతన్య, సమంతాల మజిలీ సినిమా..హిట్ టాక్ తెచ్చుకొని..సీజన్‌లో సరైన సినిమాలు లేక అల్లాడుతున్న సినీప్రియులకు ఉపశపనం కలిగించింది, హిట్ టాక్ సొంతం చేసుకొని నిన్నమొన్నటివరకు టికెట్ బుకింగ్స్‌ కూడా అదిరిపోయాయి. దీంతో కలెక్షన్స్‌ పరంగా కూడా చాలా భాగా ఫర్పామ్ చేసింది . కానీ ఇటీవల విడుదలైన జెర్సీ దెబ్బకి మజిలీ సినిమా తల్లడిల్లిపోతోంది. కలెక్షన్స్ ముందుతో పోల్చితే తగ్గిపోయాయి.

జెర్సీ పోస్టర్ Photo: twitter
జెర్సీ పోస్టర్ Photo: twitter

మజిలీ సినిమా పరిస్థితి ఇలా ఉంటే.. వరుస ప్లాప్స్‌‌లో ఉన్న సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమా పోయిన శుక్రవారం బరిలోకి దిగి,  ఎబో యావరేజ్ టాక్ తెచ్చుకొని, కలెక్షన్స్ పరంగా కూడా భాగానే రాణిస్తోంది. అయితే..నాని జెర్సీకి సూపర్ హిట్ రావడంతో పాటు..సినిమాలో నాని, శ్రధ్దా శ్రీనాథ్ నటన ఎమోషన్ సీన్లలో కట్టిపడేస్తోంది. సినిమాలో కంటెంట్ అదిరిపోవడంతో ప్రేక్షకులు..జెర్సీకి బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో గత వారం విడుదలైన మజిలీ, చిత్రలహరిలు జెర్సీ తాకిడికి తట్టుకోలేక..కలెక్షన్ల పరంగా వెనుకబడుతున్నాయి.

First published:

Tags: Gowtam Tinnanuri, Jersey, Jersey movie review, Shraddha Srinath, Telugu Cinema, Telugu Cinema News

ఉత్తమ కథలు