నానికి, సత్యం థియేటర్‌కు చాలా మంచి అనుబంధం ఉంది. సినిమాల్లోకి రాకముందు ఆ థియేటర్లోనే ఎన్నో సినిమాలు చూసాడు న్యాచురల్ స్టార్. తాను స్టార్ అయిన తర్వాత కూడా ప్రతీసారి సత్యం థియేటర్ గురించి చెబుతూనే ఉంటాడు ఈ హీరో. ఇప్పుడు కూడా మరోసారి దీని గురించే చెప్పాడు నాని. తాజాగా ఈయన ఫలక్‌నుమా దాస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాడు. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. ఈ సినిమా ప్రివ్యూ చూసిన నాని.. ఫలక్‌నుమా దాస్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
అందులో భాగంగానే సత్యం థియేటర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు న్యాచురల్ స్టార్. అందులో నాని మాట్లాడుతూ.. ‘ఈ ఈవెంట్‌కు రావడానికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడం. రెండోది.. నేను 10 ఏళ్ల యాక్టింగ్ తర్వాత కొత్త కథలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో 'వాల్‌పోస్టర్' అనే ప్రొడక్షన్ సంస్థను స్థాపించాను. దాంట్లో నెక్ట్స్ ప్రొడక్షన్లో విశ్వక్ సేన్ చేయబోతున్నాడు. ఇక మూడోది.. అసలైనది.. నిన్నే ఫలక్‌నుమాదాస్ సినిమా నాకు చూపించారు.
నేను సినిమా చూసి మాట్లాడుతున్నా. నాకు తెలిసి ఇప్పటి దాకా జరిగిన ఏ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో కూడా చీఫ్ గెస్ట్ సినిమా చూసి వచ్చుండరు. నేను చూసొచ్చి మాట్లాడుతున్నా. సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ అనిపించిన ఫీలింగ్ అయ్యో.. సత్యం థియేటర్ పడగొట్టకుండా ఉండాల్సింది అనిపించింది. ఈ సినిమా అమీర్‌పేట్ సత్యం థియేటర్లో చూసుంటే మంచి మజా వచ్చుండేది. పర్లేదు.. శ్రీరాములు అని పక్కన ఇంకో థియేటర్ ఉంది. అందులో చూద్దురు గానీ’ అంటూ చెప్పుకొచ్చాడు న్యాచురల్ స్టార్.
అక్కడితో ఆగకుండా ‘సినిమా మొదలైన తర్వాత పది నిమిషాల వరకు ఇది ఏం సినిమా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. తర్వాత మీరు మూడ్‌లో వెళ్తారు. ఆ మూడ్‌లోకి వెళ్లాక సింగిల్ స్క్రీనా, క్యూబా, మల్టీఫ్లెక్సా అనే ఫరక్ ఉండదు. అంతా సింగిల్ స్క్రీనే అనిపిస్తుంది. ఒక ప్రివ్యూ థియేటర్లో అంతగా ఎంజాయ్ చేశాం. సో.. ఫలక్‌నుమాదాస్ రేపు మనందరికీ అమీర్‌పేట్, సనత్‌నగర్, బల్కంపేట్, సాటర్డే నైట్ సోనీదాబా అన్ని మెమరీస్‌ను గుర్తు చేస్తుంది. డెఫినెట్‌గా అందరూ కనెక్ట్ అవుతారు. సినిమా చూశాక పర్టికులర్‌గా అమీర్‌పేట్ కుర్రాలకు నేను చెప్పేదేంటో అర్థమవుతుంది.
ఈ సినిమాలో చిన్న పిల్లలు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. ఉత్తేజ్ కూడా చాలా బాగా నటించారు. నా చిన్నప్పటి ఉత్తేజ్ ఇందులో కనిపించారు. ఇక ఈ ఏడాది బెస్ట్ యాంకర్ అవార్డ్ మరో అనుమానం లేకుండా తరుణ్ భాస్కర్‌కి ఇచ్చేయొచ్చు. నిజంగా.. తరుణ్ డైరెక్షన్ మానేయొచ్చు. నువ్వు నటుడుగా కంటిన్యూ చేయ్.. డైరెక్టర్ కంటే 3 రెట్లు ఎక్కువ సంపాదించొచ్చు. సంవత్సరంలో ఒక్కరోజు కూడా బిజీగా ఉండవు. నాది గ్యారెంటీ..’ అంటూ ముగించాడు న్యాచురల్ స్టార్. మరి ఈయన చెప్పిన స్థాయిలో ఫలక్‌నుమా దాస్ ఉంటుందా లేదా అనేది చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Falaknuma Dass, Nani, Telugu Cinema, Tollywood