హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu: మహేష్‌బాబు సినిమాలో.. మరో స్టార్ హీరో.. ఎవరో తెలుసా ?

Mahesh Babu: మహేష్‌బాబు సినిమాలో.. మరో స్టార్ హీరో.. ఎవరో తెలుసా ?

మహేశ్ బాబు

మహేశ్ బాబు

మహేష్ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో కొత్త సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసినమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతోంది. ఈసినిమాలో మహేష్‌తో కలిసి మరో స్టార్ హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ హవా నడుస్తోంది. బాహుబలి,ఆర్ఆర్ఆర్,ఆచార్య వంటి సినిమాల్లో ఇప్పటి వరకు ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం మనం చూశాం. ఇప్పుడు మరో మూవీ అలానే రాబోతుంది. అది కూడా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మూవీ. మహేష తొలిసారిగా కెరీర్‌లో మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్లు సమాచారం. సర్కారు వారి పాట సినిమా సక్సెస్‌తో మంచి ఫాంలో ఉన్న మహేష్ బాబు .. రానున్న సినిమాల కోసం బిజీగా మారాడు.త్వరలో ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు. ఆ సినిమాకి సంబంధించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. అవి అభిమానులలో అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేస్తున్న మహేష్ బాబు సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు సమాచారం.

మరీ మహేష్‌తో కలిసి నటించనున్న ఆ మరో స్టార్ హీరో ఎవరో? అనే కదా మీ సందేహం. అతను మరెవరో కాదు మన నేచురల్ స్టార్ నాని.ఈ మూవీని దర్శకుడు త్రివిక్రమ్ మల్టీస్టారర్ గా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల్లో చిన్న పాత్రలకు కూడా పెద్ద ఆర్టిస్టులను తీసుకుంటాడు. ఇప్పుడు ఈ సినిమాలో కీ రోల్ కోసం నేచురల్ స్టార్ నానిని సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఓ వైపు త్రివిక్రమ్, మరో వైపు మహేష్ బాబు కావడంతో నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చినవి రెండు సినిమాలే. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మూడో చిత్రమిది.. మహేష్ కి ఇది 28చిత్రం. కానీ ఆ రెండు ప్రేక్షకులకు ఎంతో ఫేవరెట్‌గా మారిన సినిమాలు. అందుకే మహేశ్‌ను త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తే మూవీ వేరే లెవెల్‌లో ఉంటుందని అభిమానులు భావిస్తారు.అయితేఇందులో ఇప్పుడు మరో స్టార్ హీరో నాని కూడా నటిస్తున్నాడన్న వార్తలతో... మహేశ్ 28వ సినిమాపై ప్రేక్షకులు అప్పుడే అంచనాలు పెంచేసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. జులైలో మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ రివీల్‌కు ముహూర్తం ఖరారు అయినట్టు టాక్ వినిపిస్తోంది. తన తండ్రి కృష్ణ పుట్టినరోజున అంటే మే 31న మహేశ్.. తన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్‌ను ప్రకటిస్తూ ఉంటాడు. అయితే ఈసారి త్రివిక్రమ్‌తో తాను చేసే సినిమా టైటిల్ రివీల్ చేసి తన తండ్రి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వనున్నాడు మహేశ్. స్క్రీప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యాక దీనిపైన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇందులో మలయాళం నటులు కూడా నటిస్తున్నట్టుగా టాలీవుడ్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.

First published:

Tags: Mahesh Babu, Nani, Trivikram Srinivas

ఉత్తమ కథలు