తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా క్లీన్ ఇమేజ్‌తో ఉండే హీరో నాని. తన పనేంటో తాను చూసుకుంటాడు ఈయన. అలాంటి నానిపై ఈ మధ్య కొందరు మాటల తూటాలు పేల్చారు. ఆయన కేవలం సినిమాల్లో మాత్రమే హీరో కానీ బయట కాదంటూ విమర్శించారు. వాళ్లు కూడా ఎవరో కాదు.. ఎన్నో ఏళ్లుగా ఆయన నటించిన సినిమాలు కొని విడుదల చేస్తున్న థియేటర్స్ అసోసియేషన్స్ సభ్యులే. టక్ జగదీష్ సినిమాను నేరుగా అమేజాన్ ప్రైమ్‌కు ఇచ్చేస్తున్నారని తెలిసిన తర్వాత ఎగ్జిబిటర్స్ ఆవేదన అంతా వాళ్ల మాటల్లోనే కనిపించింది. అయితే నానిపై విమర్శలు చేయడాన్ని సినీ పెద్దలు కూడా తప్పు బట్టారు.
వెంకటేష్ లాంటి హీరో సినిమాను ఓటిటిలో విడుదల చేసినపుడు లేవని నోళ్లు.. నాని సినిమాకు ఎందుకు లేస్తున్నాయి అంటూ కొందరు గట్టిగానే ప్రశ్నించారు. ఆ వెంటనే ఎగ్జిబిటర్లు క్షమాపణలు చెప్తూ లేఖ విడుదల చేసారు. అయితే ఇదంతా జరిగి రెండు వారాలు అయిపోతుంది. తాజాగా నాని మరోసారి ఇదే ఇష్యూ గురించి మాట్లాడాడు. తాజాగా ఈయన టక్ జగదీష్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఎమోషనల్ అయ్యాడు నేచురల్ స్టార్.
ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా ఓటిటిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నపుడు ఎంత ఆలోచించాం.. ఎన్ని రోజులు నాలుగు గోడల మధ్యలోనే కూర్చుని మనలో మనమేం బాధ పడ్డామనేది చెప్పుకోలేం అంటున్నాడు నాని. కొన్ని సినిమాలు థియేటర్స్‌లోనే చూడాలి.. కానీ బయట పరిస్థితులు బాగోలేనపుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి తప్పదు అంటున్నాడు నాని. అందుకే టక్ జగదీష్ ఓటిటిలో వస్తుంది తప్ప మరో కారణం లేదంటున్నాడు ఈయన. ఇక తన సినిమాలను బ్యాన్ చేస్తామని చెప్పిన ఎగ్జిబిటర్లకు కూడా షాకిచ్చాడు నాని. నిజంగా బయట పరిస్థితులు అన్నీ బాగుండి.. థియేటర్స్ అన్నీ ఓపెన్ అయిన తర్వాత.. తన సినిమాలు అక్కడ కాకుండా ఓటిటికి ఇచ్చినపుడు తనను తానే బ్యాన్ చేసుకుంటానని చెప్పాడు నాని.
ఆ సమయంలో తన సినిమా థియేటర్స్‌కు రాకపోతే.. వాళ్లు బ్యాన్ చేయడం కాదు.. నన్ను నేనే బ్యాన్ చేసుకుంటానంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ హీరో. ఓ సినిమాను ఓటిటికి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదని.. దానికి ఎన్నో రకాలుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పాడు నాని. అలా టక్ జగదీష్ సినిమాను దాదాపు ఆర్నెళ్లకు పైగానే హోల్డ్ చేసిన తర్వాత.. బయట ఇప్పట్లో పరిస్థితులు బెటర్ అవ్వవని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు నాని. సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా కచ్చితంగా టక్ జగదీష్ అందర్నీ అలరిస్తాడని నమ్మకంగా చెప్తున్నాడు ఈయన.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero nani, Telugu Cinema, Tollywood, Tuck Jagadish