నాని గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ తీసుకోవడం రిస్క్ అని తెలిసినా కూడా తీసుకున్నాడు నాని. జెర్సీ లాంటి సినిమా తర్వాత ఈయన చేస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో నాని ఐదుగురు ఆడవాళ్లతో కలిసి కనిపిస్తున్నాడు. 8 ఏళ్ల చిన్న పాప.. 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి.. 22 ఏళ్ల కత్తి లాంటి అమ్మాయి.. 50 ఏళ్ల అమ్మ వయసు ఉన్న మహిళ.. కాటికి కాలు చాపుకున్న బామ్మ.. ఈ ఐదుగురు గ్యాంగ్ కు ఓ లీడర్.. అతడే మన గ్యాంగ్ లీడర్. ఈ ఐదుగురు లైఫ్ సైకిల్ గ్యాంగ్ లీడర్ కథ. మరోసారి విక్రమ్ కే కుమార్ తన మార్క్ స్క్రీన్ ప్లేతో సిద్ధమైపోయాడు.
బామ్మ
— Nani (@NameisNani) July 15, 2019
వరలక్ష్మి
ప్రియ
స్వాతి
చిన్ను
REVENGERS ASSEMBLE 🖐🏼#GangleaderFirstLook 👊🏼😊
A @Vikram_K_Kumar Film
An @anirudhofficial Musical @MythriOfficial pic.twitter.com/Z9lxqMDabV
బామ్మ, స్వాతి, ప్రియ, వరలక్ష్మి, చిన్ను మధ్య జరిగే కథ ఇది. ట్విట్టర్లో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసాడు నాని. చిరంజీవి ఆల్ టైమ్ క్లాసిక్ టైటిల్ తీసుకున్నా కూడా కథపై ఉన్న నమ్మకంతో గౌరవం పెంచేస్తామంటున్నాడు విక్రమ్ కే కుమార్. ఇందులో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. జెర్సీ తర్వాత మరోసారి నాని సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఆగస్ట్ 30న విడుదల కానుంది ఈ చిత్రం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gang Leader, Nani, Telugu Cinema, Tollywood