అవును.. నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. తాజాగా విడుదలైన ఈ సినిమాలో నాని..‘మనం’ సెంటిమెంట్‌ను తనకు తెలియకుండానే ఫాలో అయ్యాడు. అసలు ఈ రెండు సినిమాలకు ఎక్కడ పోలిక ఉందనే అనుమానం రావచ్చు కానీ తనకు తెలియకుండానే మనం సినిమా సెంటిమెంట్ వాడేసుకున్నాడు నాని.ఈ రోజు విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఒక క్రికెటర్‌గా నాని అద్భుతంగా నటించడాని క్రిటిక్స్‌తో పాటు ఎన్టీఆర్ వంటి పలువురు సినీ హీరోలు ‘జెర్సీ’లో నాని నటనను మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాలో అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో నాని అద్భుతంగా ఒదిగిపోయాడు. అంతేకాదు ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ లెవల్లో ఈ సినిమాలో నటించాడు.
జెర్సీ సినిమా మొత్తం 80ల నేపథ్యంలోనే సాగుతుంది. అయితే మనం సెంటిమెంట్ విషయానికి వచ్చేసరికి.. అసలు ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. జెర్సీలో నాని పాత్ర పేరు అర్జున్.. అలాగే ఈ చిత్రంలో నానికి ఓ కొడుకు ఉన్నాడు.. అతడి పేరు నాని. ఇక్కడే అసలు సెంటిమెంట్ ఉంది. మనం సినిమాలో తండ్రీ పేరు కొడుక్కి.. కొడుకు పేరు తండ్రికి పెట్టాడు విక్రమ్ కే కుమార్. ఇప్పుడు జెర్సీలో కూడా తండ్రీ కొడుకుల పేర్లు మార్చేసాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. నిజంగానే నాని కొడుకు పేరు అర్జున్.. ఈ సినిమాలో తన పేరు అది పెట్టుకున్నాడు నాని.
ఈ సినిమాలో హీరో కొడుకుకి నాని అనే పేరు ఉంది. అలా తండ్రీ కొడుకులు తమ పేరు మార్చుకున్నారు. ఈ చిత్రం పూర్తిగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కింది. అయితే కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా ఎమోషనల్ డ్రామాగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడం విషేషం. వరసగా రెండు ఫ్లాపులతో రేసులో వెనకబడిపోయిన నాని.. ఈ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎంత వరకు ఫర్ఫామ్ చేస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhil, Amala, ANR, Box Office Collections, Jersey movie review, Manam, Naga Chaitanya Akkineni, Nagarjuna Akkineni, Nani, Samantha, Shraddha Srinath, Telugu Cinema, Tollywood, Tollywood Box Office Report