అదేంటి.. నాని ఏంటి చిరంజీవి స్థానంపై కన్నేయడం ఏంటి.. ఎంత సొంతంగా వచ్చి స్టార్ అయితే మాత్రం చిరంజీవి అయిపోతాడా.. అసలు అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? అవును నమ్మడానికి చిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం నాని జెర్సీ సినిమాతో పాటు విక్రమ్ కే కుమార్ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ మధ్యే సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ ప్లస్ టైటిల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. నాని నటిస్తున్న 24వ చిత్రం కావడంతో ఈ చిత్ర టైటిల్ కూడా ఫిబ్రవరి 24నే విడుదల చేయనున్నారు.
దానికి తోడు ఫిబ్రవరి 24 నాని పుట్టిన రోజు కూడా. అందుకే అదే రోజు టైటిల్ విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. సాయంత్రం 5 గంటలకు ఈ చిత్ర టైటిల్ బయటికి రానుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం నాని సినిమాకు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఒకప్పటి చిరంజీవి ఆల్ టైమ్ క్లాసిక్ టైటిల్. దాన్నే ఇప్పుడు నాని సినిమా కోసం వాడుకుంటున్నారని తెలుస్తుంది.
అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది ఇంకా తెలియదు. ఈ సినిమాలో నాని చుట్టూ ఎప్పుడూ అమ్మాయిలుంటారు. ఒకటి రెండు కాదు.. ఐదుగురు హీరోయిన్లు ఇందులో నటించబోతున్నారు. అందుకే ఆ గ్యాంగ్ కు లీడర్ గా ఉంటాడు కాబట్టి గ్యాంగ్ లీడర్ అంటున్నారేమో మరి..? ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. జెర్సీ తర్వాత మరోసారి నాని సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Nani, Telugu Cinema, Tollywood, Vikram K Kumar