తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న నాని..

నాచురల్ స్టార్ నాని అతి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అది చూసి ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: March 10, 2020, 1:45 PM IST
తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న నాని..
‘V’ సినిమాలో నాని (Twitter/Photo)
  • Share this:
నాచురల్ స్టార్ నాని అతి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అది చూసి ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..  నాని పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది మాత్రం ఏ యాక్సిడెంటో అనుకునేరు. ఆయన ఏ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడంటే.. ఈ యేడాది విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రాశీ ఖన్నా, కేథరిన్, ఐశ్వర్యా రాజేష్, ఇసబెల్ల హీరోయిన్స్‌గా నటించారు. ముందుగా ఈ సినిమా స్టోరీని దర్శకుడు క్రాంతి మాధవ్.. నానిని కలిసి వినిపించాడట. నాని కూడా ఈ కథ విని బాగానే ఇంప్రెస్ అయ్యాడు. అంతేకాదు క్రాంతి మాధవ్ చెప్పిన స్టోరీలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని సలహాలు కూడా ఇచ్చాడట. దానికి క్రాంతి మాధవ్.. తన కథలో ఎలాంటి మార్పులు చేయడానికి అంగీకరించలేదట. ఆ తర్వాత దర్శకుడు క్రాంతి మాధవ్.. ఇదే కథను విజయ్ దేవరకొండకు వినిపించి ఓకే చేయించుకున్నాడు. కానీ ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో‌కే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.

natural star nani escaped big problem here are the details,nani,nani acdident,nani rejects vijay devarakonda world famous lover movie,nani vijay devarakonda,nani world famous lover vijay devarakonda,nani twitter,nani instsagram,nani v movie,nani movie updates,nani tuck jagadish shyam sigharaoy,vijay devarakonda,vijay deverakonda,nani,nani about vijay devarakonda,vijay devarakonda movies,nani (award winner),vijay deverakonda speech,nani & vijay devarakonda,nani and vijay devarakonda,nani movies,nani fun with vijay devarakonda,nani and vijay devarakonda movie,nani about vijay devarakonda craze,vijay devarakonda over nani,vijay devarakonda about nani,vijay devarakonda fun with nani,tollywood,telugu cinema,నాని,నాని అతిపెద్ద ప్రమాదం,పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ నాని,నాని రిజెక్ట్స్ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్,నాని వరల్డ్ ఫేమస్ లవర్,
నాని రిజెక్ట్ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ (Twitter/Photo)


ఒకవేళ ఇదే  వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను నాని చేసి ఉంటే.. ఈ చిత్రం ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేది. నాని.. ఈ కథను రిజెక్ట్ చేసి మంచి పనే చేసాడంటూ ఆయన్ని మెచ్చుకుంటున్నారు. ఇక నాని ఈ విషయాలను రీసెంట్‌గా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్చూలో వెల్లడించాడు. మొత్తానికి నాని.. వరల్డ్ ఫేమస్ లవర్ స్టోరీని రిజెక్ట్ చేసి మంచి పనే చేసాడంటూ నాని ఫ్యాన్స్.. తమ అభిమాన హీరోకు కథలపై ఎంత పట్టు ఉందో చెబుతున్నారు. ప్రస్తుతం నాని హీరోగా నటించిన ‘వీ’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. మరోవైపు నాని హీరోగా ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఈ సినిమాలన్ని కూడా ఈ యేడాదే విడుదల కానున్నాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 10, 2020, 1:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading