Home /News /movies /

NATURAL STAR NANI DASARA MOVIE SPECIAL POSTER RELEASE SB

Dasara Movie: నాని దసర స్పెషల్ పోస్టర్ రిలీజ్.. !

Photo Twitter

Photo Twitter

ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం” అంటూ తన మాస్ గ్యాంగ్ తో కలిసున్న పిక్ షేర్ చేసాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    నాచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “దసరా”. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ప్రారంభం అయ్యింది. దర్శకుడు శ్రీకాంత్ ఓడెల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తుండగా మేకర్స్ అయితే సాలిడ్ మాస్ ఎలిమెంట్స్ తో శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి అయితే మేకర్స్ లేటెస్ట్ గా ఈ ఫ్రెండ్షిప్ డే కానుకగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని నాని పై రిలీజ్ చేశారు.

    దసరా స్పెషల్ పోస్టర్‌లో నాని తో పాటుగా ఈ సినిమాలో కనిపించే తన ఫ్రెండ్స్ పాత్రలు అందరితో కలిసి నాని మంచి హ్యాపీ మూమెంట్ లో కనిపిస్తున్నాడు. మరి ఈ పోస్టర్ తో అయితే నాని కూడా ఇంట్రెస్టింగ్ ట్యాగ్ పెట్టాడు. “ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం” అంటూ తన మాస్ గ్యాంగ్ తో కలిసున్న పిక్ షేర్ చేసాడు. మొత్తానికి అయితే ఈ స్పెషల్ డే కి మేకర్స్ నుంచి వచ్చిన ఈ పోస్టర్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సుధాకర్ చెరుకూరి నిర్మాణం వహిస్తున్నారు.



    నాని హీరోగా ఇటీవ‌లే విడుద‌లైన ‘అంటే సుంద‌రానికీ’ పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాత్రం వసూళ్లు లేక.. ఫ్లాప్‌గా మిగిలింది. నాని సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఒకే స్టైల్లో కాకుండా రకరకాల సినిమాలు చేస్తు ఉంటాడు. ఈయ‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు తీసిన‌వ‌న్ని ఒక‌దానికొక‌టి సంబంధం లేకుండా విభిన్నంగా ఉంటాయి. అయితే ఈయ‌న సినిమాలను ప్రేక్ష‌కులు ఆధ‌రిస్తున్నా క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాలేక‌పోతున్నాయి. అయితే శ్యామ్ సింగరాయ్ సినిమా మాత్రం నానికి మంచి పేరు తెచ్చి పెట్టింది. నాని గత ఐదారు చిత్రాలు కూడా క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాలేక‌పోయాయి. నిజానికి చెప్పాలంటే ‘ఎమ్‌సీఏ’ త‌ర్వాత నాని కెరీర్ ఆ స్థాయిలో ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో హిట్టు రాలేదు. దీంతో ఈ సారి ఈ క్ర‌మంలోనే నాని ఈ సారి ‘ద‌స‌రా’ సినిమాతో అవుట్ అండ్ అవుట్ మాస్ క‌థ‌తో క‌మ‌ర్షియ‌ల్ హిట్టు కొట్ట‌డానికి ముస్తాబ‌వుతున్నాడు.nani
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Hero nani, Natural star nani

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు