న్యాచులర్ స్టార్ నాని అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈయన తాజా సినిమా వి మరికొన్ని గంటల్లో నేరుగా ఆన్లైన్ విడుదల కానుంది. అక్కడే స్ట్రీమ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు నిర్మాత దిల్ రాజు. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు మరో హీరోగా నటించాడు. ఇక ఈ చిత్రంలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది.
తెలుగులో ఓటిటిలో విడుదలవుతున్న తొలి క్రేజీ సినిమా ఇదే. ఇప్పటి వరకు అన్నీ చిన్న సినిమాలు మాత్రమే నేరుగా ఆన్లైన్లో విడుదలయ్యాయి. నాని తర్వాత మిగిలిన హీరోలు కూడా క్యూ కడతారని అంతా ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే నాని మాత్రం ఇప్పుడు అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈయన నటించిన 25వ సినిమా థియేటర్స్లో కాకుండా హోమ్ థియేటర్స్లో విడుదలవుతుంది.
నాని తన 25వ సినిమాను తనకు లైఫ్ ఇచ్చిన ఇంద్రగంటితోనే చేసాడు. అది కూడా విలన్గా నటించాడు. ఇలాంటి క్రేజీ సినిమాను థియేటర్లో అభిమానులతో కలిసి చూడాలని నాని చాలా ఆశ పడ్డాడు.. కానీ చివరికి కరోనా కారణంగా ఇంట్లోనే చూడాల్సి వస్తుంది. బహుశా ఏ హీరో కూడా తన ల్యాండ్ మార్క్ సినిమాను థియేటర్ కాకుండా ఇంట్లోనే చూసుకుని ఉండడేమో..?
అందరు హీరోల ల్యాండ్ మార్క్ సినిమాలు థియేటర్స్లో వస్తే నాని మాత్రం తన సినిమాను ఇంట్లోనే చూసుకోండి అంటున్నాడు. ఈ అరుదైన రికార్డ్ ఈయనకు తప్ప మరే హీరోకు సాధ్యం కాదేమో..? కానీ ఇలాంటి వింత రికార్డులు మాత్రం ఏ హీరో కూడా కావాలని కోరుకోడు.. నానికి వచ్చిందంతే. ఏం చేస్తాం.. తప్పదు.. ఆరోగ్యం కంటే ముఖ్యమేది కాదు కదా.. అందుకే ఇంట్లోనే కూర్చుని సెప్టెంబర్ 5 నుంచి నాని సినిమాను ఎంజాయ్ చేయండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero nani, Telugu Cinema, Tollywood