హోమ్ /వార్తలు /సినిమా /

Nani movies: ఏంటి నాని.. ఇంతకీ ఎన్ని సినిమాలు చేస్తున్నావేంటి..?

Nani movies: ఏంటి నాని.. ఇంతకీ ఎన్ని సినిమాలు చేస్తున్నావేంటి..?

నాని ‘అంటే సుందరానికీ’ (Twitter/Photo)

నాని ‘అంటే సుందరానికీ’ (Twitter/Photo)

Nani movies: వరస ఫ్లాపులు వస్తుంటే ఎవరైనా జోరు తగ్గిస్తారు.. కాస్త నెమ్మదిగా కథలు ఎంచుకుంటారు. గ్యాప్ తీసుకుని అయినా పర్లేదు హిట్ కొట్టాలనుకుంటారు. కానీ నాని మాత్రం అలా కాదు. ఫ్లాపులు వస్తున్నపుడే జోరు పెంచేస్తున్నాడు.

వరస ఫ్లాపులు వస్తుంటే ఎవరైనా జోరు తగ్గిస్తారు.. కాస్త నెమ్మదిగా కథలు ఎంచుకుంటారు. గ్యాప్ తీసుకుని అయినా పర్లేదు హిట్ కొట్టాలనుకుంటారు. కానీ నాని మాత్రం అలా కాదు. ఫ్లాపులు వస్తున్నపుడే జోరు పెంచేస్తున్నాడు. మరీ ముఖ్యంగా వి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నాని మరింత స్పీడ్ పెంచేసాడు. ఇంతకీ ఎన్ని సినిమాలు చేస్తున్నావ్ అబ్బాయి అంటూ అడుగుతున్నారు. తాజాగా మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టేసాడు నాని. ఈయన వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఒకటి రెండూ మూడు అంటూ లెక్క పెట్టుకోవాలంతే. ముఖ్యంగా వి ఫ్లాప్ అయిన తర్వాత ఈయన సినిమాల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే టక్ జగదీష్ సెట్స్‌పై ఉంది. ఈ చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. నిన్ను కోరి లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. దాంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు కూడా లైన్‌లో పెట్టాడు ఈయన. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో కోల్‌కత్తా నేపథ్యంలో శ్యామ్ సింగ రాయ్ సినిమాను ఒప్పుకున్నాడు నాని.

nani,nani twitter,nani ante sundaraniki,ante sundaraniki first look,ante sundaraniki nani,nani latest movie announcement,nani ante sundariniki first look,nani new movie ante sundaraniki,ante sundharaniki nani movie,nani ante sundharaniki movie teaser,nani movie curtain raiser,నాని,నాని వరస సినిమాలు,నాని అంటే సుందరానికి,నాని సినిమాలు
నాని శ్యామ సింగ్ రాయ్ సినిమా

ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ పాటికే సినిమా మొదలై విడుదలకు సిద్ధమై ఉండేది. కానీ కరోనా కారణంగా లేట్ అయింది. 2021లో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉండగానే ఇప్పుడు మరో సినిమా సెట్స్‌పైకి తీసుకొస్తున్నాడు. అదే అంటే సుందరానికి..! మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో వరస విజయాలు అందుకున్న కుర్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన కథ నచ్చి వెంటనే ఒప్పుకున్నాడు నాని. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

nani,nani twitter,nani ante sundaraniki,ante sundaraniki first look,ante sundaraniki nani,nani latest movie announcement,nani ante sundariniki first look,nani new movie ante sundaraniki,ante sundharaniki nani movie,nani ante sundharaniki movie teaser,nani movie curtain raiser,నాని,నాని వరస సినిమాలు,నాని అంటే సుందరానికి,నాని సినిమాలు
నాని ‘అంటే సుందరానికీ’ (Twitter/Photo)

గతేడాది మైత్రితో నాని చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా ఫ్లాప్ అయింది. దాంతో ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కుంటున్నారు. అంటే సుందరానికి కర్టెన్ రైజర్ కూడా విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది. 100 శాతం నవ్వులు గ్యారెంటీగా ఈ సినిమా ఉండబోతుంది. ఒకప్పుడు వంశీ సినిమాలు ఎలా ఉండేవో.. ఇప్పుడు నాని సినిమా కూడా అలాగే ఉండబోతుందేమో అనిపిస్తుంది. ఏదేమైనా కూడా నాని జోరు అదరహో అనిపిస్తుందంతే.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Nani, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు