హోమ్ /వార్తలు /సినిమా /

Nani - Ante Sundaraniki : నాని ‘అంటే సుందరానికి’ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

Nani - Ante Sundaraniki : నాని ‘అంటే సుందరానికి’ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

ఇందులో ఒక బ్రహ్మణ యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు నాని. దీనికి సంబంధించిన టీజర్ మొన్న విడుదలైంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది సినిమా. జూన్ 10న విడుదల కానుంది ఈ చిత్రం. బ్రహ్మణ యువకుడి కష్టాలను నాని చాలా ఫన్నీగా చూపించబోతున్నాడు.

ఇందులో ఒక బ్రహ్మణ యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు నాని. దీనికి సంబంధించిన టీజర్ మొన్న విడుదలైంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది సినిమా. జూన్ 10న విడుదల కానుంది ఈ చిత్రం. బ్రహ్మణ యువకుడి కష్టాలను నాని చాలా ఫన్నీగా చూపించబోతున్నాడు.

Nani - Ante Sundaraniki  :  నాచురల్ స్టార్ నాని ' సినిమాల విషయంలో మాములుగా స్పీడ్‌గా లేడు. ఒక సినిమా కంప్లీట్ అవ్వడమే లేదో మరో సినిమాను లైన్‌లో పెడుతున్నాడు. తాజాగా ‘అంటే సుందరానికి’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ ఇవ్వనున్నారు.

    Nani - Ante Sundaraniki  :  నాచురల్ స్టార్ నాని ' సినిమాల విషయంలో మాములుగా స్పీడ్‌గా లేడు. ఒక సినిమా కంప్లీట్ అవ్వడమే లేదో మరో సినిమాను లైన్‌లో పెడుతున్నాడు. గతేడాది ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలతో పలకరించారు. ఇందులో ‘టక్ జగదీష్’ ఓటీటీ వేదికగా విడుదలైన డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో  ‘శ్యామ్ సింగరాయ్’(Shyam Singha Roy) మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో పునర్జన్మల నేపథ్యంలో  తెరకెక్కిన ఈ సినిమా  గతేడాది డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేద్దామనుకున్నారు. కానీ కుదరలేదు.

    ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లో  కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సంగతి పక్కన పెడితే.. నాని .. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాకు షూటింగ్ కంప్లీట్ కావడంతో చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టేసారు. అయితే.. ఈ నెల 24న నాని పుట్టినరోజు సందర్భంగా మేజర్ అప్డేట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

    నాని ‘అంటే సుందరానికి’ మూవీ నుంచి మేజర్ అప్‌డేట్ (Twitter/Photo)

    ‘అంటే సుందరానికి’ సినిమాలో నాని సంప్రదా బ్రాహ్మణ యువకుని పాత్రలో నటిస్తున్నట్టు పోస్టర్ చూస్తే అర్ధమవుతోంది. ఈ పోస్టర్‌లో యువ సుందరుడి బర్త్ డే  సందర్భంగా హోమం రేపు సాయంత్రం 4.05 నుంచి మొదలు కానున్నట్టు ప్రకటించారు. రేపటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేయనున్నట్టు చెప్పకనే చెప్పారు.  గతంలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, విక్రమ్, అల్లు అర్జున్ వంటి హీరోలు బ్రాహ్మణ యువకుల పాత్రల్లో నటించిన మెప్పించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు వాళ్ల బాటలో నాని కూడా బ్రాహ్మణ యువకుడి పాత్రలో కనిపించనున్నారు.

    అంతేకాదు పల్లెటూరులో ఏదో గీతాలు పాడుకునే బ్రాణ్మణ యువకుడు విదేశాల్లో రాక్ స్టార్‌గా ఎలా అలరించడనేదే ఈ సినిమా స్టోరీ అన్నట్టు కనబడుతోంది. పోస్టర్‌లో వీణ, కెమెరా కూడా ఉన్నాయి. ఇప్పటికే నాని.. ’కృష్ణార్జున యుద్ధం’లో రాక్ స్టార్ పాత్రలో అలరించిన సంగతి తెలిసిందేె కదా. ఇపుడు ‘అంటే సుందరానికి’ సినిమాలో అదే తరహా పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమా అడల్ట్‌ కామెడీ జానర్‌లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

    నాని ‘అంటే సుందరానికి’ మూవీ (Twitter/Photo)

    ‘అంటే.. సుందరానికి’ సినిమాలో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్‌ నటిస్తున్నారు.  సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు. దీంతో పాటు నాని ప్రస్తుతం ‘దసరా’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

    Top Gross Indian Movies in 2020-21 : తానాజీ టూ పుష్ప వరకు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు..

    తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే విజయ దశమి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా పూర్తి మాస్ ఎంటర్టైనర్‌గా రానుంది.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ante sundaraniki, Natural star nani, Tollywood

    ఉత్తమ కథలు