హోమ్ /వార్తలు /సినిమా /

Nani - Ante Sundaraniki Teaser Talk : నాని ‘అంటే సుందరానికీ’ టీజర్ టాక్.. కామెడీ అదరిందిగా..

Nani - Ante Sundaraniki Teaser Talk : నాని ‘అంటే సుందరానికీ’ టీజర్ టాక్.. కామెడీ అదరిందిగా..

నాని ‘అంటే సుందరానికీ’ మూవీ టీజర్ టాక్ (Twitter/Photo)

నాని ‘అంటే సుందరానికీ’ మూవీ టీజర్ టాక్ (Twitter/Photo)

Nani - Ante Sundaraniki  : నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ కాసేపటి క్రితమే విడుదలైంది.

Nani - Ante Sundaraniki  :  నాచురల్ స్టార్ నాని ' సినిమాల విషయంలో మాములుగా స్పీడ్‌గా లేడు. ఒక సినిమా కంప్లీట్ అవ్వడమే లేదో మరో సినిమాను లైన్‌లో పెడుతున్నాడు. గతేడాది ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలతో పలకరించారు. ఇందులో ‘టక్ జగదీష్’ ఓటీటీ వేదికగా విడుదలైన డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో  ‘శ్యామ్ సింగరాయ్’(Shyam Singha Roy) మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో పునర్జన్మల నేపథ్యంలో  తెరకెక్కిన ఈ సినిమా  గతేడాది డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేద్దామనుకున్నారు. కానీ కుదరలేదు.

ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లో  కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సంగతి పక్కన పెడితే.. నాని .. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ అనే సినిమా కంప్లీట్ చేసారు. రిలీజ్‌కు రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

‘అంటే సుందరానికి’ సినిమాలో నాని బ్రాహ్మణ యువకుని పాత్రలో నటించారు. ఈ టీజర్ చూస్తుంటే.. అలనాటి భారతీ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతాకోక చిలుక’ సినిమాను గుర్తుకు తెచ్చింది. అది సీరియస్‌తో కూడిన ప్రేమకథ అయితే.. ఇందులో కామెడీ యాంగిల్‌లో ప్రెజెంట్ చేసాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఈ సినిమాలో హీరోయిన్ నజ్రియా క్రిష్టియన్ అమ్మాయి పాత్రలో నటించింది. మరి బ్రాహ్మణ యువకుడు, క్రిష్టియన్ అమ్మాయల ఇంటర్ రిలీజియన్ ప్రేమకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడ్డాయి. వాటిని సుందరం ఎలా సాల్వ్ చేసాడనే దానిపై ఈ సినిమాను తెరకెక్కించినట్టు కనబడుతోంది.

Balakrishna - Roja : మంత్రి అయిన తర్వాత బాలకృష్ణ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన రోజా..

నాని బ్రాహ్మణ యువకుడి పాత్రలో ఇరగదీసాడు.  గతంలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, విక్రమ్, అల్లు అర్జున్ వంటి హీరోలు బ్రాహ్మణ యువకుల పాత్రల్లో నటించిన మెప్పించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు వాళ్ల బాటలో నాని కూడా బ్రాహ్మణ యువకుడి పాత్రలో నటించారు. పోస్టర్‌లో వీణ, కెమెరా కూడా ఉన్నాయి. ఇప్పటికే నాని.. ’కృష్ణార్జున యుద్ధం’లో రాక్ స్టార్ పాత్రలో అలరించిన సంగతి తెలిసిందేె కదా. ఇపుడు ‘అంటే సుందరానికి’ సినిమాలో అదే తరహా పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమా అడల్ట్‌ కామెడీ జానర్‌లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమా జూన్ 10న విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో విడుదల చేస్తున్నారు.

Ram Charan : రియల్ హీరోలతో రామ్ చరణ్.. దేశ సైనికులతో మెగా పవర్ స్టార్ రచ్చ..

‘అంటే.. సుందరానికి’ సినిమాలో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్‌ నటిస్తున్నారు.  సంగీతం వివేక్ సాగర్ అందించారు. దీంతో పాటు నాని ప్రస్తుతం ‘దసరా’ సినిమాతో బిజీగా ఉన్నాడు.తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే విజయ దశమి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా పూర్తి మాస్ ఎంటర్టైనర్‌గా రానుంది.

First published:

Tags: Ante sundaraniki, Nani, Tollywood

ఉత్తమ కథలు