Home /News /movies /

NATURAL STAR NANI ANTE SUNDARANIKI TEASER GETS SOLID RESPONSE ON YOUTUBE SR

Nani | Ante Sundaraniki Teaser : సోషల్ మీడియాలో దూసుకుపోతున్న అంటే సుందరానికీ టీజర్.. సాలిడ్ రెస్పాన్స్..

Ante Sundaraniki Teaser Photo Twitter

Ante Sundaraniki Teaser Photo Twitter

Nani | Ante Sundaraniki Teaser : నాని (Nani )నటిస్తోన్న లేటెస్ట్ సినిమా అంటే సుందరానికి..  (Ante Sundaraniki ) ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం జూన్ 10న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను వదిలారు మేకర్స్.

ఇంకా చదవండి ...
  Nani :  నాచురల్ స్టార్ నాని గత యేడాది నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన  మూవీ ‘శ్యామ్ సింగరాయ్’.(Shyam Singha Roy )మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. అంతకు ముందు నాని నటించిన రెండు చిత్రాలు ‘వీ’(V), ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై ఓకే అనిపించుకున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత నాని నటించిన సినిమా థియేటర్స్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇక అది అలా ఉంటే నాని (Nani )నటిస్తోన్న మరో సినిమా అంటే సుందరానికి..  (Ante Sundaraniki ) ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం జూన్ 10న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి  (Ante Sundaraniki Teaser) టీజర్‌ను వదిలారు మేకర్స్. ఈ సినిమాలో నాని బ్రాహ్మణ యువకుని పాత్రలో నటించారు. ఈ టీజర్ చూస్తుంటే.. అలనాటి భారతీ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతాకోక చిలుక’ సినిమాను గుర్తుకు తెచ్చింది. అది సీరియస్‌తో కూడిన ప్రేమకథ అయితే.. ఇందులో కామెడీ యాంగిల్‌లో ప్రెజెంట్ చేసాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. హీరోయిన్ నజ్రియా (Nazriya Fahadh) క్రిష్టియన్ అమ్మాయి పాత్రలో నటించింది. మరి బ్రాహ్మణ యువకుడు, క్రిష్టియన్ అమ్మాయల ఇంటర్ రిలీజియన్ ప్రేమకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడ్డాయి. వాటిని సుందరం ఎలా సాల్వ్ చేసాడనే దానిపై ఈ సినిమాను తెరకెక్కించినట్టు కనబడుతోంది.

  ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఈ టీజర్ యూ ట్యూబ్‌లో ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. టీజర్ ఇప్పటికే 11 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ను సాధించి కేక పెట్టిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఈసినిమా నుంచి ఇటీవల ఫస్ట్ సింగిల్ (Ante Sundaraniki first song) విడుదలైంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. పంచకట్టు అనే టైటిల్‌తో విడుదలైన లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది. వివేక్ సాగర్ (Vivek Sagar) స్వరపరిచిన ఈ పాటకు హసిత్ గోలీ లిరిక్స్ అందించారు. ప్రముఖ కర్నాటిక్ గాయని అరుణా సాయిరామ్ పాడారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోన్న ఈ ఫస్ట్ సింగిల్ నెటిజన్స్‌ను బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రంలో నాని సరసన మలయాళీ నటి నజ్రియా నజీమ్ (Nazriya Nazim)  హీరోయిన్‌గా చేస్తున్నారు. నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.


  ఇక నాని నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. నాని  కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) అనే కొత్త దర్శకుడుతో ‘దసరా’ సినిమాను చేస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు.  ఈ సినిమాలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోన్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఇటీవల రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని అంటున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో దసరా విడుదల కానుంది. దసరా (Dasara) సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రెండో హీరోయిన్‌కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం సమంత (Samantha Ruth Prabhu)ను తీసుకుంటున్నారట.

  ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేశారు. లుంగీతో మాసీవ్‌గా ఉన్న నాని లుక్‌కు టెర్రిఫిక్‌గా ఉంది. దాంతో  పాటు  ఈ సినిమా నుంచి స్పార్క్ అంటూ టీజర్ లాంటిది విడుదల చేశారు. నోటిలో బీడీతో పూర్తి మాస్ లుక్‌లో నాని లుక్ కేక పుట్టిస్తోంది. ‘పుష్ప’లో అల్లు అర్జున్ డిఫరెంట్‌ లుక్‌లో ఎలా మెస్మరైజ్ చేసారో.. నాని లుక్ అదే విధంగా టెర్రిఫిక్‌గా ఉంది.  ఈ లుక్‌  ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు నాని.  తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ యువకుడి పాత్ర కోసం ఇక్కడి యాసపై పట్టుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ని కూడా నియమించుకున్నారట నాని.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Ante sundaraniki, Nani, Nazriya nazim, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు