హోమ్ /వార్తలు /సినిమా /

Nani - Ante Sundaraniki : నాని ‘అంటే సుందరానికీ’ మూవీ నుంచి ట్రైలర్ గ్లింప్స్ విడుదల..

Nani - Ante Sundaraniki : నాని ‘అంటే సుందరానికీ’ మూవీ నుంచి ట్రైలర్ గ్లింప్స్ విడుదల..

నాని ‘అంటే సుందరానికీ’ (Nani Ante Sundaraniki Photo : Twitter)

నాని ‘అంటే సుందరానికీ’ (Nani Ante Sundaraniki Photo : Twitter)

Nani - Ante Sundaraniki  :  నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’. ఈ సినిమా ప్రమోషన్‌లో ట్రైలర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

  Nani - Ante Sundaraniki  :  నాచురల్ స్టార్ నాని ' సినిమాల విషయంలో మాములుగా స్పీడ్‌గా లేడు. ఒక సినిమా కంప్లీట్ అవ్వడమే లేదో మరో సినిమాను లైన్‌లో పెడుతున్నాడు. తాజాగా ఈయన ‘అంటే సుందరానికీ’ సినిమా పూర్తి చేసాడు.ఈ సినిమా వచ్చే జూన్ 10న  ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది.ఇందులో భాగంగా ఈ సినిమా ప్రమోషన్స్‌ను పెంచారు. ఇప్పటికే టీజర్‌తో పాటు ఒక పాటను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈసినిమా నుంచి మరోసాంగ్  రంగో రంగా అంటూ సాగే ఈ పాటను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విలేజ్ వాతావరణంలో పెరిగిన ఒక బ్రాహ్మణ యువకుడికీ.. ఫారిన్‌లో పెరిగిన ఒక క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే హాస్య ప్రేమకథ.

  ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన మలయాళీ నటి నజ్రియా నజీమ్ (Nazriya Nazim)  హీరోయిన్‌గా చేస్తున్నారు. నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. అంతేకాదు జూన్ 2న  ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

  ఇక నాని నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. నాని  కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) అనే కొత్త దర్శకుడుతో ‘దసరా’ సినిమాను చేస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు.  ఈ సినిమాలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోన్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఇటీవల రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని అంటున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో దసరా విడుదల కానుంది.

  Tollywood Top Most Profitable Movies : RRR, బాహుబలి సహా టాలీవుడ్‌లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ తెలుగు సినిమాలు ఇవే..


  దసరా (Dasara) సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రెండో హీరోయిన్‌కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం సమంత (Samantha Ruth Prabhu)ను తీసుకుంటున్నారట. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేశారు. లుంగీతో మాసీవ్‌గా ఉన్న నాని లుక్‌కు టెర్రిఫిక్‌గా ఉంది. దాంతో  పాటు  ఈ సినిమా నుంచి స్పార్క్ అంటూ టీజర్ లాంటిది విడుదల చేశారు. నోటిలో బీడీతో పూర్తి మాస్ లుక్‌లో నాని లుక్ కేక పుట్టిస్తోంది. ‘పుష్ప’లో అల్లు అర్జున్ డిఫరెంట్‌ లుక్‌లో ఎలా మెస్మరైజ్ చేసారో.. నాని లుక్ అదే విధంగా టెర్రిఫిక్‌గా ఉంది.  ఈ లుక్‌  ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు నాని.  తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ యువకుడి పాత్ర కోసం ఇక్కడి యాసపై పట్టుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ని కూడా నియమించుకున్నారట నాని.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Ante sundaraniki, Natural star nani, Tollywood

  ఉత్తమ కథలు