• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NATURAL STAR NANI ANNOUNCED HIT MOVIE SEQUEL AND HEHAS GIVEN HINT ON CHANGING HERO MHN

Natural Star Nani - Hit Sequel: 'హిట్ 2'పై నాని క్లారిటీ.. హీరో మారిపోతున్నాడంటూ హింట్‌ వచ్చేసింది

Natural Star Nani - Hit Sequel: 'హిట్ 2'పై నాని క్లారిటీ.. హీరో మారిపోతున్నాడంటూ హింట్‌ వచ్చేసింది

Natural star Nani announced HIT movie sequel and hehas given hint on changing hero

Natural Star Nani - Hit Sequel: గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించిన 'హిట్' చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాని సినిమా సీక్వెల్‌గా 'హిట్‌ 2'ను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు.

  • Share this:
    గత ఏడాది కోవిడ్‌ కారణంగా ఏప్రిల్‌ నుంచి సినిమాలేవీ విడుదల కాలేదు. గత ఏడాది విడుదలై విజయం సాధించిన సినిమాల్లో హిట్‌ మూవీ ఒకటి. హోమిసైడ్‌ ఇంటర్‌వెన్షన్‌ టీమ్‌ కేసులను ఎలా పరిష్కరిస్తుందనే ఓ ఆలోచనతో దర్శకుడు శైలేంద్ర కొలను రాసుకున్నకథ ఇది. కథ నచ్చడంతో హీరో నాని నిర్మాతగా మారి సినిమాను రూపొందించాడు. నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై యువ కథానాయకుడు విష్వక్ సేన్ హీరోగా రూపొందిన చిత్రం `హిట్‌`. `ది ఫ‌స్ట్ కేస్‌` ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా విడుదలై నేటికి(ఫిబ్రవరి 28) సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాని సినిమా సీక్వెల్‌గా 'హిట్‌ 2'ను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు.



    "హిట్‌' విడుదలై ఏడాది పూర్తయ్యింది. 'హిట్' పార్ట్‌2ను అనౌన్స్‌ చేయడానికి ఇంత కంటే మంచి రోజు లేదు. ఇంతకు ముందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన హిట్‌(మోమిసైడ్‌ ఇంటర్‌వెన్షన్‌ టీమ్‌) టీమ్‌ ఆఫీసర్‌ విక్రమ్‌ రుద్రరాజు కనిపించకుండా అమ్మాయి కేసును ఎలా డీల్‌ చేశాడనే కథాంశంతో సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా 'హిట్‌' సినిమాను రూపొందించాం. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన హిట్‌ టీమ్‌ ఆఫీసర్‌ కె.డి.తో కలిసి టెన్షన్‌తో గోళ్లు కొరికేసుకునేంత ఉత్కంఠతకు లోను చేసే జర్నీని చేయబోతున్నారు" అని నాని ట్వీట్‌ చేశారు.


    ఈ ట్వీట్‌లోనే కె.డి. ఎవరు అనేలా నాని క్వశ్చన్‌ మార్క్‌ పెట్టాడు. అంటే హీరో మారుతున్నాడని నాని చెప్పకనే చెప్పేశాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాల రూపకల్పనలో స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న అడివిశేష్‌ హిట్‌ 2లో నటిస్తాడని ఇది వరకు వార్తలు వినిపించాయి. నాని పోకడ చూస్తుంటే ఈ వార్తలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు