మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఒకప్పుడు ఆలోచించే వాళ్లు మన హీరోలు. కానీ ఇప్పుడున్న హీరోలు అలా కాదు. కథ కలిస్తే చాలు మల్టీస్టారర్‌కు ఛలో అంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు అలా మల్టీస్టారర్స్ చేసారు. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి కూడా. తాజాగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలే కలిసి నటిస్తున్నారు. దాంతో అంతా అదే దారిలో ఉన్నారు. ఇదిలా ఉంటే నాని ఇప్పటికే ఈయన సుధీర్ బాబుతో వి.. నాగార్జునతో దేవదాస్ లాంటి సినిమాలు చేసాడు.
ఈ రెండు ఫలితం తేడాగా వచ్చాయి. అయినా కూడా కథ నచ్చితే మళ్లీ మల్టీస్టారర్ చేయడానికి తనకేం ఇబ్బంది లేదంటున్నాడు. అందుకే మరో ట్రై చేస్తున్నాడు న్యాచురల్ స్టార్. తాజాగా ఈయన తన స్నేహితుడు రానా దగ్గుబాటితో కలిసి నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరు హీరోల కోసం కథ సిద్ధం చేయాలని ఓ దర్శకుడికి నిర్మాత సురేష్ బాబు చెప్పినట్లు తెలుస్తుంది.
రానా, నాని చాలా కాలంగా మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ఈవెంట్స్ కూడా హోస్ట్ చేసారు. దాంతో ఇద్దరి మధ్యా మంచి ర్యాపో కూడా ఉంది. అందుకే ఇప్పుడు ఇద్దరూ కలిసి నటించబోతున్నారు. రానా తండ్రి సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.
పక్కా యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఈ సినిమా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను 2021 ప్రథమార్థంలో మొదలు పెట్టాలని చూస్తున్నారు. నాని ప్రస్తుతం టక్ జగదీష్‌తో పాటు శ్యామ సింగరాయ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు రానా కూడా అరణ్యతో పాటు మరో మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ ఇద్దరూ ఫ్రీ అయిన తర్వాత రానా, నాని మల్టీస్టారర్ మొదలు కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero nani, Rana daggubati, Telugu Cinema, Tollywood