మరో క్రేజీ దర్శకుడి చిత్రానికి ఓకే చెప్పిన నాచురల్ స్టార్ నాని..

నాని.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘V’అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో నాని మొదటిసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా నాని.. తన పుట్టినరోజు సందర్భంగా 27వ చిత్రాన్ని ప్రకటించారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 24, 2020, 8:36 PM IST
మరో క్రేజీ దర్శకుడి చిత్రానికి ఓకే చెప్పిన నాచురల్ స్టార్ నాని..
నాని 27వ చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ (Youtube/Credit)
  • Share this:
లాస్ట్ ఇయర్ నాని.. గౌతమ్ తిన్ననూరి దర్వత్వంలో చేసిన ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. త్వరలోనే నాని.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘V’అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో నాని మొదటిసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఉగాది కానుకగా విడుదల చేస్తున్నారు.  ఈ సినిమాలో సుధీర్ బాబు మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. హీరోగా నానికి ఇది 25వ సినిమా. ఈ సినిమా తర్వాత నాని.. ‘నిన్నుకోరి’ వంటి రొమాంటిక్ లవ్ స్టోరీ అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో  ‘టక్ జగదీష్’ అనే కొత్త సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా నాని తన బర్త్ డే సందర్భంగా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో కొత్త  సినిమాను అనౌన్స్ చేసాడు.అంతేకాదు ఈ సినిమాకు ‘శ్యామ్ సింగరాయ్’ అనే విచిత్రమైన టైటిల్‌ను అనౌన్స్ చేసాడు. ఈ చిత్రాన్ని 1970-80ల నేపథ్యంలో తెరకెక్కించనున్నట్టు ఈ సినిమా పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంబంధించిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. అంతేకాదు ఈ చిత్రాన్ని ఈ యేడాది చివరల్లో డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు. మొత్తానికి ఈ యేడాది నాని నుంచి మొత్తంగా 3 సినిమాలు విడుదల కానున్నాయన్న మాట.

First published: February 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు