హోమ్ /వార్తలు /సినిమా /

Nani - Ante Sundaraniki : నాని ‘అంటే సుందరానికీ’ మూవీ టీజర్‌కు ముహూర్తం ఖరారు..

Nani - Ante Sundaraniki : నాని ‘అంటే సుందరానికీ’ మూవీ టీజర్‌కు ముహూర్తం ఖరారు..

నాచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికీ’ మూవీ టీజర్‌కు ముహూర్తం ఖరారు (Twitter/Photo)

నాచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికీ’ మూవీ టీజర్‌కు ముహూర్తం ఖరారు (Twitter/Photo)

Nani - Ante Sundaraniki  : నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌కు ముహూర్తం ఖరారైంది.

Nani - Ante Sundaraniki  :  నాచురల్ స్టార్ నాని ' సినిమాల విషయంలో మాములుగా స్పీడ్‌గా లేడు. ఒక సినిమా కంప్లీట్ అవ్వడమే లేదో మరో సినిమాను లైన్‌లో పెడుతున్నాడు. గతేడాది ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలతో పలకరించారు. ఇందులో ‘టక్ జగదీష్’ ఓటీటీ వేదికగా విడుదలైన డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో  ‘శ్యామ్ సింగరాయ్’(Shyam Singha Roy) మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో పునర్జన్మల నేపథ్యంలో  తెరకెక్కిన ఈ సినిమా  గతేడాది డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేద్దామనుకున్నారు. కానీ కుదరలేదు.

ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లో  కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సంగతి పక్కన పెడితే.. నాని .. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ అనే సినిమా కంప్లీట్ చేసారు. రిలీజ్‌కు రెడీగా ఉంది.

Mohan Babu Vs Pawan Kalyan : అప్పట్లోనే మోహన్ బాబుపై పై చేయి సాధించిన పవన్ కళ్యాణ్.. ఇంతకీ ఏందా కహాని..


‘అంటే సుందరానికి’ సినిమాలో నాని బ్రాహ్మణ యువకుని పాత్రలో నటిస్తున్నారు.   గతంలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, విక్రమ్, అల్లు అర్జున్ వంటి హీరోలు బ్రాహ్మణ యువకుల పాత్రల్లో నటించిన మెప్పించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు వాళ్ల బాటలో నాని కూడా బ్రాహ్మణ యువకుడి పాత్రలో కనిపించనున్నారు.అంతేకాదు పల్లెటూరులో ఏదో గీతాలు పాడుకునే బ్రాణ్మణ యువకుడు విదేశాల్లో రాక్ స్టార్‌గా ఎలా అలరించడనేదే ఈ సినిమా స్టోరీ అన్నట్టు కనబడుతోంది. పోస్టర్‌లో వీణ, కెమెరా కూడా ఉన్నాయి. ఇప్పటికే నాని.. ’కృష్ణార్జున యుద్ధం’లో రాక్ స్టార్ పాత్రలో అలరించిన సంగతి తెలిసిందేె కదా. ఇపుడు ‘అంటే సుందరానికి’ సినిమాలో అదే తరహా పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమా అడల్ట్‌ కామెడీ జానర్‌లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమా జూన్ 10న విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో విడుదల చేస్తున్నారు.

‘అంటే సుందరానికీ’ మూవీ టీజర్‌కు ముహూర్తం ఖరారు (Twitter/Photo)

‘అంటే.. సుందరానికి’ సినిమాలో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్‌ నటిస్తున్నారు.  సంగీతం వివేక్ సాగర్ అందించారు. దీంతో పాటు నాని ప్రస్తుతం ‘దసరా’ సినిమాతో బిజీగా ఉన్నాడు.తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే విజయ దశమి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా పూర్తి మాస్ ఎంటర్టైనర్‌గా రానుంది.

First published:

Tags: Ante sundaraniki, Nani, Tollywood

ఉత్తమ కథలు