Choose Municipal Ward
  CLICK HERE FOR DETAILED RESULTS

  మా పార్టీలో చేరితే నువ్వే CM.. విజయ్‌కు జాతీయ పార్టీ బంపర్ ఆఫర్..

  Thalapathy Vijay: రాజకీయాలు నాకు పడవంటూనే రజినీకాంత్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు త‌మిళ హీరో విజ‌య్ విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న్ని రాజ‌కీయాల్లోకి ర‌మ్మ‌ని అభిమానులు పిలుస్తూనే ఉన్నారు.

  Praveen Kumar Vadla | news18-telugu
  Updated: February 23, 2020, 7:49 PM IST
  మా పార్టీలో చేరితే నువ్వే CM.. విజయ్‌కు జాతీయ పార్టీ బంపర్ ఆఫర్..
  అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే నిర్మాతలతో సంప్రదింపులు కూడా జరిపిందని ప్రచారం జరుగుతుంది. 100 కోట్లకు పైగానే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది కూడా. కానీ నిర్మాతలు మాత్రం ఒకే మాటపై ఉన్నారు. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత కావాలంటే 2021 సంక్రాంతికి అయినా విడుదల చేయాలని చూస్తున్నారు కానీ ఓటిటి వైపు మాత్రం రావట్లేదు.
  • Share this:
  తొండ ముదిరి ఊస‌ర‌వెల్లి అయిన‌ట్లు సినిమా న‌టుడు ముదిరి ముదిరి చివ‌రికి రాజ‌కీయ నాయ‌కుడు అవుతున్నాడు. ఇది ఇప్ప‌ట్నుంచి వ‌స్తున్న ఆన‌వాయితీ కాదు.. ఎప్ప‌ట్నుంచో సాగుతుంది. ఈ మ‌ధ్య కాలంలో కూడా చాలా మంది సినిమా ప్ర‌ముఖులు రాజ‌కీయాల్లోకి వెళ్లారు. కొన్ని ద‌శాబ్ధాలుగా సినిమా వాళ్లు పాలిటిక్స్‌లోకి రావ‌డం.. అక్క‌డ సంచ‌ల‌నం సృష్టించ‌డం కూడా మ‌నం చూస్తూనే ఉన్నాం. రాజకీయాలు నాకు పడవంటూనే రజినీకాంత్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు త‌మిళ హీరో విజ‌య్ విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న్ని రాజ‌కీయాల్లోకి ర‌మ్మ‌ని అభిమానులు పిలుస్తూనే ఉన్నారు. పైగా ఈ మధ్య మరీ ఇది ఎక్కువైపోయింది.

  మాస్టర్ షూటింగ్ స్పాట్‌లో విజయ్ సెల్ఫీ (Thalapathy Vijay selfie)
  మాస్టర్ షూటింగ్ స్పాట్‌లో విజయ్ సెల్ఫీ (Thalapathy Vijay selfie)


  మొన్న ఆయన ఇంట్లో ఐటి దాడులు జరిగిన తర్వాత విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ పట్టు బడుతున్నారు ఫ్యాన్స్. బిజేపీ కావాలనే విజయ్‌పై కక్ష్య కట్టిందని.. తమ పార్టీకి సపోర్ట్ చేయలేదనే ఇలా చేస్తున్నారని వాళ్లపై మండిపడుతున్నారు ఫ్యాన్స్. దానికి తోడు అప్పట్లో ఆయన పుట్టిన రోజు సంద‌ర్భంగా క‌ట్టిన ఫ్లెక్సీల‌లో కూడా కాబోయే త‌మిళ‌నాడు సిఎం అంటూ క‌ట్టారు ఫ్యాన్స్. నువ్వు రాజ‌కీయాల్లోకి రా త‌లైవా అంటూ ఫ్యాన్స్ ఆహ్వానిస్తున్నారు. 25 ఏళ్ల కింద ద‌ర్శ‌కుడు ఎస్ఏ చంద్రశేఖర్ వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు విజ‌య్. ఆ త‌ర్వాత కొన్నేళ్ల పాటు విజ‌యం కోసం ఆరాట‌ప‌డినా కూడా ఒక్క‌సారి కుదురుకున్నాక సంచ‌ల‌నాలు సృష్టించాడు.

  విజయ్ ఫైల్ ఫోటో (Thalapathy Vijay Politics)
  విజయ్ ఫైల్ ఫోటో (Thalapathy Vijay Politics)


  ముఖ్యంగా తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంత ఇమేజ్ తెచ్చుకున్నాడో.. త‌మిళ‌నాట అంత‌కంటే ఎక్కువే తెచ్చుకున్నాడు విజ‌య్. మొన్నటికి మొన్న ప్రశాంత్ కిషోర్, విజయ్ ఉన్న ఫోటోలు తమిళనాట సంచలనం రేపాయి. 2011 ఎన్నికలకు ముందే విజయ్ రాజకీయాల్లోకి వ‌స్తాడ‌ని టాక్ వినిపించింది. అదీ కాకుండా అప్ప‌ట్లో ఆయ‌న ఎన్నాడీఎంకేకు మ‌ద్ద‌తు కూడా తెలియ‌చేసాడు. ఆ త‌ర్వాత జ‌య‌ల‌లిత‌కు వ్య‌తిరేకంగా మారాడు. ఈయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తాడేమో అనుకుంటున్న త‌రుణంలో ర‌జినీకాంత్ ఇంటికి పిలిచి మ‌రీ క్లాస్ పీకాడ‌ని వార్త‌లు త‌మిళ‌నాట వినిపిస్తాయి. నీకింకా టైమ్ ఉంది.. హాయిగా సినిమాలు చేసుకో అంటూ ర‌జినీ చెప్ప‌డంతోనే విజ‌య్ ఆ ఆలోచ‌న మానుకున్నాడంటారు విశ్లేష‌కులు.

  విజయ్ ఫైల్ ఫోటో (Thalapathy Vijay Politics)
  విజయ్ ఫైల్ ఫోటో (Thalapathy Vijay Politics)


  సినిమాల్లో మాత్రం కొన్నేళ్లుగా నాయ‌కుడి పాత్ర‌లే ఎక్కువ‌గా చేస్తున్నాడు. గత మూడేళ్లుగా మెర్స‌ల్, త‌లైవా, స‌ర్కార్, బిగిల్ లాంటి సినిమాల్లో ఈయ‌న పొలిటిక‌ల్ హీట్ ఉన్న పాత్రలే చేసాడు. ఇప్పుడు కూడా మాస్టర్ అంటూ వస్తున్నాడు. ఈ హీరోకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఒకవేళ విజయ్ కాంగ్రెస్‌లోకి వస్తే ఆ పార్టీ తరపున భవిష్యత్తులో సీఎం అభ్యర్థి కూడా అవుతారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత జరుగుతున్నా హీరో విజయ్ మాత్రం పెదవి విప్పట్లేదు. ఇంతకీ ఆయన రాజకీయాల్లోకి వస్తారా.. వస్తే ఒకవేళ ఏ పార్టీలో చేరుతారు అనేది తేలాలంటే మాత్రం మరికొంత సమయం వేచి చూడాల్సిందే.
  Published by: Praveen Kumar Vadla
  First published: February 23, 2020, 7:45 PM IST
  మరిన్ని చదవండి
  తదుపరి వార్తలు

  Top Stories

  corona virus btn
  corona virus btn
  Loading