news18-telugu
Updated: August 9, 2019, 4:33 PM IST
రామ్ చరణ్ రంగస్థలం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా రంగస్థలం జాతీయ అవార్డు గెలుచుకుంది. ఈ సినిమాకు బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో నేషనల్ అవార్డు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో రామ్‌చరణ్ హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చెవిటివాడిగా రామ్ చరణ్ నటన సినిమాకి హైలైట్. సుకుమార్ డైరెక్షన్ సినిమాకు ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. సమంతం నటన కూడా చూసి తీరాల్సిందే. చివరి అరగంట సినిమాలో చాలా ప్లస్ పాయింట్. ఎక్కువ నిడివి ఉన్నా కూడా ఆ బిగువు తప్పకుండా సినిమాను రక్తికట్టించారు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు కావడంతో సినిమా యూనిట్ మొత్తం ఖుషీగా ఉంది. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలకు పంట పండింది. మహానటికి అవార్డులు వరించాయి. జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేష్ ఎంపికైంది. బెస్ట్ తెలుగు సినిమా, బెస్ట్ కాస్ట్యూమ్స్ విభాగంలో కూడా జాతీయ అవార్డులు దక్కాయి. చిలసౌ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కింద పురస్కారానికి ఎంపికైంది. వీటితోపాటు నాని నిర్మాతగా వచ్చిన ‘ఆ’ సినిమాకు కూడా రెండు అవార్డులు దక్కాయి. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్, బెస్ట్ మేకప్ కేటగిరీల్లో అవార్డులు గెలుచుకుంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
August 9, 2019, 3:49 PM IST