మహానటికి షాక్ ఇచ్చిన ట్విట్టర్.. అకౌంట్ సస్పెండ్ చేసిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం..

ట్విట్టర్ లోగో

Twitter | మహానటికి షాక్ ఇచ్చిన ట్విట్టర్.. అకౌంట్ సస్పెండ్ చేసిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం.

 • Share this:
  Twitter | మహానటికి షాక్ ఇచ్చిన ట్విట్టర్.. అకౌంట్ సస్పెండ్ చేసిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం. ఇక్కడ మహానటి అంటే.. కీర్తి సురేష్ కాదు.. జాతీయ స్థాయిలో మూడు సార్లు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కంగనా రనౌత్‌ ట్విట్టర్ అకౌంట్‌ను సస్పెండ్ చేస్తూ ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె ట్విట్టర్‌కు సంబంధించిన నియమ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆమె ట్విట్టర్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ట్విట్టర్ పేర్కొంది. మరోవైపు కొంత మంది కంగనా అభిమానులు ట్విట్టర్ గత కొన్ని రోజులుగా ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. గతంలో రైతు ఉద్యమాల నేపథ్యంలో ట్విట్టర్ హెడ్ భారత దేశ ప్రభుత్వ నిర్ణయాలకు  వ్యతిరేకంగా ట్వీట్ చేసారు. ఆ తర్వాత ట్విట్టర్ హెడ్ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు.

  ఇక కంగనా విషయానికొస్తే.. ఆమె రెండు మూడు రోజులుగా ఆమె బంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ  టీఎంసీ  గెలిచినప్పటి నుంచి ఆమె పార్టీకి చెందిన కార్యకర్తలు.. బీజేపీ వాళ్లను ఆఫీసులను తగల బెట్టడంతో పాటు  వాళ్ల కార్యకర్తలను టార్గెట్ చేసిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించినందుకే ఆమె ట్విట్టర్ అకౌంట్‌ను సస్పెండ్ చేస్తారా అంటూ కొంత మంది నెటిజన్లు మండిపడుతున్నారు.

  కంగనా అకౌంట్ సస్పెండ్ చేసిన ట్విట్టర్ (Twitter/Photo)


  మరోవైపు ట్విట్టర్ గత కొన్ని రోజులుగా ఏక పక్షంగా కొంత మందిని టార్గెట్ చేస్తున్నట్టు నెటిజన్లు మండిపడుతున్నారు.  మరోవైపు కంగనా కూడా ట్విట్టర్ పై మండిపడింది. ట్విట్టర్ వాల్లు స్వతహాగా తెల్లవాళ్లు అయినందున నల్లవాళ్లు, కాస్త రంగు తక్కువ ఉన్నవాళ్లను బానిసలుగా చూసే మనసత్వం ఉంది. వాళ్లకు వాళ్ల ఆలోచనలకు అనుగుణంగా ట్వీట్ చేసే వాళ్లు అయితేనే నచ్చుతుంది. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేవాళ్లంటే అసలు పడడు. నా ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ చేసినంత మాత్రాన నన్ను ఎవరు ఆపలేరు. నా గొంతుక వినిపించేందుకు నాకు ఎన్నో సోషల్ మీడియాల ఫ్లాట్‌ఫారాలున్నాయి. అందులో సినిమా కూడా ఒకటి అంటూ ఓ రేంజ్‌లో ట్విట్టర్ పై ఫైర్ అయింది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.  రీసెంట్‌గా మన దేశంలో ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా ‘Koo’ అనే కొత్త యాప్‌ను మన దేశంలో లక్షలాది మంది డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈ ఇండియన్ సోషల్ నెట్ వర్కింగ్ యాప్‌ను పలువురు ప్రముఖులు కూడా వాడుతున్నారు. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్ వంటి వారు ఇప్పటికే Kooలో అకౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ చేరిపోయారు. Koo లో అకౌంట్ ఓపెన్ చేసింది కంగనా. అంతేకాకుండా ఈ సందర్భంగా ట్విట్టర్ కి కూడా చురక అంటించింది. " ట్విట్టర్ నీ టైమ్ అయిపోయింది. కూ యాప్ కు హాయ్ చెప్పే టైం వచ్చింది. త్వరలోనే అకౌంట్ వివరాలు తెలుపుతాను. దేశీయంగా అభివృద్ది చెందిన యాప్ ఓపెన్ చేసినందుకు ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది " అంటూ ట్వీట్ చేశారు. అప్పటి నుంచి కంగనా పై ట్విట్టర్ ఆగ్రహంగా ఉన్నట్టు ఆమె అభిమానులు చెబుతున్నారు. మొత్తంగా ట్విట్టర్ టైమ్ చూసి కంగనా పై వేటు వేసేసింది. ప్రస్తుతం కంగనా రనౌత్.. జయలలిత జీవిత కథ ఆధారంగా ‘తలైవి’ సినిమా చేసింది. కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఈ పాటికి ఈ సినిమా విడుదలై ఉండేది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: