రియల్ స్టార్ శ్రీహరి కొడుకుతో జాతీయ అవార్డు గ్రహీత సినిమా..

Satish Vegesna: రియల్ స్టార్ శ్రీహరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు శ్రీహరి జయంతి కూడా. ఆయన భౌతికంగా దూరమైనా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 15, 2020, 2:29 PM IST
రియల్ స్టార్ శ్రీహరి కొడుకుతో జాతీయ అవార్డు గ్రహీత సినిమా..
సతీష్ వేగేశ్న (satish vegesna)
  • Share this:
రియల్ స్టార్ శ్రీహరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు శ్రీహరి జయంతి కూడా. ఆయన భౌతికంగా దూరమైనా కూడా అభిమానులు మాత్రం ఇప్పటికీ మనసులోనే ఉంచుకున్నారు. అలాంటి శ్రీహరి కొడుకు మేఘాంష్ శ్రీహరి సినిమా కూడా ఇదే రోజు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ‘శతమానం భవతి’ సినిమాతో జాతీయ అవార్డు దక్కించుకున్న దర్శకుడు సతీశ్ వేగేశ్న కాంబినేషన్‌లో ఈ సినిమా ఉండబోతుంది. తన కొడుకు సమీర్ వేగేశ్నతో పాటు మేఘాంష్ శ్రీహరితో ఈ మల్టీస్టారర్ చేయబోతున్నాడు సతీష్ వేగేశ్న.
సతీష్ వేగేశ్న (satish vegesna)
సతీష్ వేగేశ్న (satish vegesna)

లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎల్‌.వి సత్యనారాయణ (సత్తిబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సందర్భంగా సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ.. ''నేను ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించాను. కానీ తొలిసారి పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాను. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. కరోనా వైరస్ ప్రభావ పరిస్థితులు కాస్త చక్కబడ్డ తర్వాత సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాం'' అని తెలిపాడు. నిర్మాత ఎం.ఎల్‌.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ''శతమానం భవతి నా హృదయానికెంతో దగ్గరైన సినిమా. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన సతీశ్ వేగేశ్నగారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే హీరోయిన్స్‌, ఇతర నటీనటుల వివరాలను తెలియజేస్తాం'' అన్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: August 15, 2020, 2:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading