Satish Vegesna Kothi Kommachi: వేగేశ్న సతీష్ 'కోతి కొమ్మచ్చి' సినిమా ప్రారంభం..

Satish Vegesna Kothi Kommachi: శతమానం భవతి లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా తీసిన దర్శకుడు సతీష్ వేగేశ్న ఇప్పుడు తన పంథా మార్చుకున్నాడు. శ్రీనివాస కళ్యాణం, ఎంత మంచివాడవురా లాంటి కుటుంబ కథల తర్వాత కామెడీ ట్రాక్ ఎక్కాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 25, 2020, 5:06 PM IST
Satish Vegesna Kothi Kommachi: వేగేశ్న సతీష్ 'కోతి కొమ్మచ్చి' సినిమా ప్రారంభం..
సతీష్ వేగేశ్న కోతి కొమ్మచ్చి సినిమా ఓపెనింగ్ (kothi kommachi movie opening)
  • Share this:
శతమానం భవతి లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా తీసిన దర్శకుడు సతీష్ వేగేశ్న ఇప్పుడు తన పంథా మార్చుకున్నాడు. శ్రీనివాస కళ్యాణం, ఎంత మంచివాడవురా లాంటి కుటుంబ కథల తర్వాత కామెడీ ట్రాక్ ఎక్కాడు. రియల్ స్టార్ శ్రీహరి కొడుకు మేఘాంశ్ శ్రీహరి.. తన వారసుడు సమీర్ వేగేశ్నలతో కలిసి కోతి కొమ్మచ్చి అనే కామెడీ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నాడు సతీష్ వేగేశ్న. ఈ సినిమాను లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్నాడు. విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది ఈ కోతి కొమ్మచ్చి. నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా వచ్చి మొదటి షాట్‌కి క్లాప్ కొట్టగా.. హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్చాన్ చేసాడు. ఈ సినిమా గురించి దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ.. "యూత్‌ఫుల్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న మా చిత్రాన్ని విజయదశమి పర్వదినం రోజు ప్రారంభించడం జరిగింది.. నవంబర్ 3 నుండి అమలాపురంలో షూటింగ్ మొదలు పెడతాము.. ఆ తర్వాత వైజాగ్‌లో కొంత పార్ట్ షూట్ చేయబోతున్నాము.. ఒకే షెడ్యుల్ లో సినిమాను పూర్తి చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాము." అని తెలిపాడు.
సతీష్ వేగేశ్న కోతి కొమ్మచ్చి సినిమా ఓపెనింగ్ (kothi kommachi movie opening)
సతీష్ వేగేశ్న కోతి కొమ్మచ్చి సినిమా ఓపెనింగ్ (kothi kommachi movie opening)


నిర్మాత ఎం ఎల్ వి సత్యానారాయణ మాట్లాడుతూ " సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. వేగేశ్న సతీష్ గారు మా బ్యానర్ లో ఈ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మేఘమ్ష్ శ్రీహరి , సమీర్‌లకు ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం అందిస్తుందని నమ్ముతున్నాము." అన్నారు
సతీష్ వేగేశ్న కోతి కొమ్మచ్చి సినిమా ఓపెనింగ్ (kothi kommachi movie opening)
సతీష్ వేగేశ్న కోతి కొమ్మచ్చి సినిమా ఓపెనింగ్ (kothi kommachi movie opening)

హీరోలు మేఘాంష్ శ్రీహరి, సమీర్ కూడా కోతి కొమ్మచ్చి షూటింగ్ కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే షూటింగ్‌లో పాల్గోనబోతున్నామని చెప్పుకొచ్చారు. తమకు కూడా ఇది చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని.. ప్రేక్షకుల ఆశీస్సులు తమపై ఉండాలని కోరుకున్నారు ఈ కుర్ర హీరోలిద్దరూ. వీళ్లకు జోడీగా లవర్ ఫేమ్ రిద్ది కుమార్.. మేఘా చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు అనుప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. మరి ఈ చిత్రంతో సతీష్ వేగేశ్న ఏ మేరకు నవ్వులు పూయిస్తాడో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: October 25, 2020, 5:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading