• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NATIONAL AWARD WINNING DIRECTOR SATISH VEGESNA LATEST MOVIE KOTHI KOMMACHI THEME SONG TO BE RELEASED BY DIL RAJU PK

Kothi Kommachi - Dil Raju: ‘కోతి కొమ్మచ్చి’ ప్రమోషన్స్ షురూ.. దిల్ రాజు చేతుల మీదుగా థీమ్ సాంగ్..

Kothi Kommachi - Dil Raju: ‘కోతి కొమ్మచ్చి’ ప్రమోషన్స్ షురూ.. దిల్ రాజు చేతుల మీదుగా థీమ్ సాంగ్..

సతీష్ వేగేశ్న కోతి కొమ్మచ్చి (Kothi Kommachi movie)

Kothi Kommachi - Dil Raju: శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న సతీష్ వేగేశ్న చాలా రోజుల తర్వాత మళ్లీ కామెడీ ట్రాక్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్నలు హీరోలుగా తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'కోతి కొమ్మచ్చి'.

  • Share this:
శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న సతీష్ వేగేశ్న చాలా రోజుల తర్వాత మళ్లీ కామెడీ ట్రాక్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్నలు హీరోలుగా తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'కోతి కొమ్మచ్చి' షూటింగ్ రికార్డు టైమ్‌లో పూర్తి చేసాడు. కరోన వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ఒక సినిమా షూటింగ్ మొదలు పెట్టి కేవలం నెల రోజుల్లోనే అవుట్ డోర్‌లో షూటింగ్ పూర్తి చేయడం చాలా కష్టం. అయితే ఈ అసాధ్యాన్ని దిగ్విజయంగా సుసాధ్యం చేసి చూపించారు 'కోతి కొమ్మచి' టీం. అమలాపురం, విశాఖపట్నం , రాజమండ్రి లాంటి ప్రదేశాల్లో దిగ్విజయంగా ఈ చిత్రం పూర్తి చేసారు. అక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా నిర్విరామంగా షూటింగ్ చేసారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో చాలా మంది సీనియర్ నటీనటులు కనిపిస్తున్నారు. ముఖ్యంగా రాజేంద్ర, నరేష్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయని ధీమాగా చెప్తున్నారు చిత్రయూనిట్. దాంతో పాటు హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యిందని తెలుస్తుంది.

వైజాగ్‌లోని అందమైన లొకేషన్స్‌లో తీసిన సన్నివేశాలు బాగా వచ్చాయని తెలిపారు. కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ కూడా సినిమాలో చాలా బాగా ఉండబోతున్నాయంటున్నాడు సతీష్ వేగేశ్న. అనూప్ మ్యూజిక్ ఇచ్చిన ఆల్బమ్ కూడా సినిమాకు హైలైట్ కానుంది. ఓవరాల్‌గా చాలా రోజుల తర్వాత వేగేశ్న సతీష్ నుంచి ఓ మంచి యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడని తెలుస్తుంది.
kothi kommachi movie theme song dil raju,kothi kommachi team interview,meghamsh kothi kommachi,kothi kommachi movie trailer,kothi kommachi 2020 telugu movie,kothi kommachi movie shooting,kothi kommachi interview,kothi kommachi movie team interview,kothi komachi movie,kothi kommachi movie opening,kothi kommachi shooting begins,కోతి కొమ్మచ్చి షూటింగ్,కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ దిల్ రాజు
సతీష్ వేగేశ్న కోతి కొమ్మచ్చి (Kothi Kommachi movie)

ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఎప్రిల్ 23 ఉదయం ఈ సినిమా థీమ్ సాంగ్ విడుదల కానుంది. దిల్ రాజు ఈ పాటను విడుదల చేస్తుండటం విశేషం. చిన్నా పెద్దలు అందర్నీ ఆకట్టుకునేలా 2డి యానిమేషన్‌లో కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ డిజైన్ చేసారు దర్శక నిర్మాతలు. సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: