ప్రస్తుతం మెగాస్టార్ తన 152వ చిత్రం ఆచార్యను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత చిరంజీవి కోసం రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో ఒకటి మలయాళ రీమేక్ లూసిఫర్.. మరో చిత్రం తమిళ చిత్రం వేదాళం రీమేక్. ఈ రెండింటిలో ముందుగా ఆచార్యను సెట్స్‌పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు మెగాస్టార్. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తో పాటు, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తుంటే.. చిరుకి కుడిభుజంగా ఉండే ఓ పాత్ర, చిరు సోదరి పాత్ర, చిరు సోదరి భర్త..సినిమాకు మెయిన్ విలన్ పాత్ర సినిమాలో కీలకంగా ఉంటాయి.
ఇందులో చిరు సోదరి పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై పెద్ద చర్చే జరుగుతూ వచ్చింది. ముందుగా విజయశాంతి చిరు సోదరిగా నటిస్తారని టాక్ వినిపించింది. తర్వాత జెనీలియా పేరు హల్చల్ చేసింది. తర్వాత మలయాళ లూసిఫర్‌లో ఆ పాత్ర చేసిన ముంజు వారియర్‌నే తీసుకుంటారని వార్తలు వినిపించాయి. రీసెంట్గా శివగామి .. చిరంజీవి చెల్లెలుగా కనిపిస్తుందని అన్నారు. అయితే వీరెవరు లూసిఫర్‌లో నటించడం లేదు. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి నటిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రియమణి.. వెంకటేశ్ నారప్ప, రానా విరాటపర్వంలో, ఓ ప్యాన్ ఇండియా సినిమాలోనూ నటిస్తూ బిజీబిజీగా ఉంది. ఇప్పుడు ఆమె లిస్టులో మరో సినిమా వచ్చి చేరిందని అంటున్నారు. మధ్యలో కాస్త గ్యాప్ తీసుకున్న ప్రియమణి మళ్లీ ఇప్పుడు వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.
ఈ సినిమా దర్శకుడెవరనే విషయంలోనూ పెద్ద చర్చే జరిగింది. ముందుగా లూసిఫర్ రీమేక్‌ను సాహో పేమ్ సుజిత్ తెరకెక్కిస్తాడని అన్నారు. అయితే చివరి నిమిషంలో సుజిత్ స్థానంలో వి.వి.వినాయక్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ చివరకు వినాయక్ స్థానంలో కోలీవుడ్ దర్శకుడు మోహన్‌రాజా ఇప్పుడు లూసిఫర్ రీమేక్‌ను తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవి ఆచార్య ముగిసిన తర్వాత ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడనుంది. తెలుగులో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి బైరెడ్డి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. రామ్‌చరణ్‌తో పాటు ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా తర్వాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ రూపొందనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.