హోమ్ /వార్తలు /సినిమా /

Bigg Boss 5 Telugu Priya: ప్రియను గుంటనక్కతో పోల్చిన నటరాజ్ మాస్టర్.. సెకండ్ వీకే కొట్టుకుచచ్చిన కంటెస్టెంట్లు?

Bigg Boss 5 Telugu Priya: ప్రియను గుంటనక్కతో పోల్చిన నటరాజ్ మాస్టర్.. సెకండ్ వీకే కొట్టుకుచచ్చిన కంటెస్టెంట్లు?

Bigg Boss 5 Telugu Priya

Bigg Boss 5 Telugu Priya

Bigg Boss 5 Telugu Priya: బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం నుండే హైలెట్ గా మారింది. ఇప్పటికే నాలుగు సీజన్ లు పూర్తికాగా ఐదవ సీజన్ మాత్రం బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో టీవీ యాంకర్లు, బుల్లితెర వెండితెర నటులు, సోషల్ మీడియా సెలబ్రెటీలు పాల్గొనగా మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు హౌస్ లో అడుగు పెట్టారు.

ఇంకా చదవండి ...

  Bigg Boss 5 Telugu Priya: బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం నుండే హైలెట్ గా మారింది. ఇప్పటికే నాలుగు సీజన్ లు పూర్తికాగా ఐదవ సీజన్ మాత్రం బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో టీవీ యాంకర్లు, బుల్లితెర వెండితెర నటులు, సోషల్ మీడియా సెలబ్రెటీలు పాల్గొనగా మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు హౌస్ లో అడుగు పెట్టారు. ఇక షో ప్రారంభమై ఒక వారం కూడా పూర్తయి రెండవ వారం లోకి అడుగుపెట్టింది. ఇందులో పోయిన వారం మొదటి నామినేషన్ లో బోల్డ్ బ్యూటీ సరయు ఎలిమినేట్ అయింది.

  పోయిన వారం మొత్తం పరిచయాలతో, గొడవలతో, కాంప్ర మైజ్ లతో, కాంట్రవర్సి లతో సాగింది. ఇక ఈ వారం మాత్రం మొదటి రోజే హౌస్ లో బూతు మాటల రచ్చ జరిగింది. ఏకంగా కొట్టుకు చచ్చినట్లే కనిపించారు కంటెస్టెంట్ లు. నిజానికి నిన్నటి ఎపిసోడ్ చూసిన వాళ్లంతా తెగ షాక్ అయ్యారునే చెప్పాలి. ఇదిలా ఉంటే కంటెస్టెంట్ ప్రియను గుంటనక్క తో పోల్చాడు మరో కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్.

  ఇది కూడా చదవండి:బిగ్ బాంబ్ మర్చిపోయిన బిగ్ బాస్.. ఇంత మతిమరుపైతే ఎలా అంటూ ట్రోల్?

  మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ బాగా హైలెట్ గా మారింది. ఎవరు కూడా ఎక్కడా తగ్గలేదు అన్నట్లే కనిపించారు. మొన్నటిదాకా గొడవపడి కాంప్రమైజ్ అయిన కంటెస్టెంట్ లు ఒకేసారి గొడవలకు దిగారు. సరయు మాట్లాడే బూతు మాటలు కంటే ఎక్కువ బూతులు మాట్లాడారు కొందరు. ఇక బిగ్ బాస్ రెండు టీమ్ లుగా విడగొట్టి వారితో నామినేషన్ రౌండ్ జరిపించారు. మొత్తానికి 2 టీమ్స్ తమకు నచ్చని వాళ్ళని నామినేట్ చేస్తూ వాళ్ల ముఖాలకు రెడ్ పెయింట్ తో పూసారు.

  ఇది కూడా చదవండి:సరయు దెబ్బకు బెదిరిపోయిన అరియనా.. ఇంటర్వ్యూలో గుట్టు అంత విప్పేసిందిగా

  ఇక నటరాజ్ మాస్టర్ ప్రియ, పింకి ని నామినేట్ చేశాడు. ప్రియ కూడా నటరాజ్ మాస్టర్ పేరును లాగింది. ఇక నటరాజ్ మాస్టర్ ప్రియ ను కొన్ని విమర్శలు చేశాడు. అంతేకాకుండా గుంటనక్క మేకల వచ్చి ఏడుగురిని చెడగొట్టింది అంటూ వాళ్ళందరూ గొర్రెలు అయ్యారు అని కామెంట్స్ చేశాడు. వెంటనే ప్రియా కోపంతో రగిలిపోతూ అంటే నామినేట్ చేసిన వాళ్ళందరూ గొర్రెలా అంటూ ప్రశ్నించింది. వీరిద్దరి మధ్య కాకుండా మరో ఇద్దరిద్దరు కంటెస్టెంట్ ల మధ్య కూడా బాగానే రచ్చ జరిగింది. ఇక కంటెస్టెంట్ లు మాట్లాడిన బూతు మాటలను సోషల్ వీడియో ట్రోల్లర్స్ మాత్రం ట్రోలింగ్స్ కు బాగా వాడుకుంటున్నారు. నెటిజన్లు మాత్రం ఇది షోనా అంటూ విమర్శలు చేస్తున్నారు.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Bigg Boss 5 Telugu, Natraj master, Priya, Star Maa

  ఉత్తమ కథలు