మా అధ్యక్షుడైన నరేష్... ఎన్నికల్లో భారీ విజయం

నరేష్ (Image : Twitter)

MAA Elections 2019 : ప్రతిష్టాత్మకమైన మా ఎన్నికల్లో అందరూ ఊహించినట్లుగానే నరేష్ విజయం సాధించారు.

  • Share this:
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల్లో నరేష్ భారీ విజయం దక్కించుకున్నారు. ప్రత్యర్థిగా నిలిచిన శివాజీ రాజాకు 199 ఓట్లు పోలవగా... నరేశ్‌కు 268 ఓట్లు పోలయ్యాయి. ఫలితంగా 69 ఓట్ల ఆధిక్యంతో నరేష్ గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ గెలుపును ముందే ఊహించామంటున్న ఆర్టిస్టులు... ఫార్మాల్టీ ప్రకారం ఎన్నికలు జరిగాయని చెబుతున్నారు. ఇక MAA జనరల్‌ సెక్రటరీగా జీవిత రాజశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్‌, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, ట్రెజరర్‌గా రాజీవ్‌ కనకాల, జాయింట్‌ సెక్రటరీగా గౌతమ్‌రాజు, శివబాలాజీ విజయం సాధించారు. వీళ్లలో మొదటి నుంచీ తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున్న నటి హేమ... స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా అలీ, రవిప్రకాష్, తనికెళ్ల భరణి, సాయికుమార్‌, ఉత్తేజ్‌, పృథ్వి, జాకీ, సురేశ్‌ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్‌, సమీర్‌, ఏడిద శ్రీరామ్‌, రాజా రవీంద్ర, తనీష్‌, జయలక్ష్మి, కరాటి కల్యాణి, వేణుమాధవ్‌, పసునూరి శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో... టాలీవుడ్‌ నటీనటుల్లో సంతోషం వెల్లివిరిసింది. ఇదే ఐకమత్యంతో సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలని అంతా కోరుకుంటున్నారు.

నరేష్ గెలుస్తారని అందరూ ఊహించినా... శివాజీ రాజా కూడా గట్టిపోటీయే ఇచ్చారు. ఓ దశలో పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగింది. ‘మా’లో మొత్తం 745 మంది సభ్యులుగా ఉండగా... వారిలో 472 మంది మాత్రమే ఓటు వేశారు. అయినప్పటికీ... ‘మా’ ఎన్నికల చరిత్రలో ఎక్కువ పోలింగ్‌ నమోదవడం ఇదే తొలిసారి. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో తొలి ఓటును నటుడు నరేష్ వేయగా... చివరి ఓటును కమెడియన్ రాజబాబు సోదరుడు చిట్టిబాబు వేశారు. టాలీవుడ్ ప్రముఖులంతా ఫిల్మ్‌ఛాంబర్‌కు వచ్చి ఓట్లు వేశారు. ఇదివరకు ఈవీఎంలతో ఎన్నికలు జరపగా... ఈసారి మాత్రం బ్యాలెట్‌ పత్రాల్ని వాడారు. అందువల్ల కౌంటింగ్ లేటై... ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఎన్నికల ఫలితాల్ని ప్రకటించాల్సి వచ్చింది.

 

ఇవి కూడా చదవండి :

UPSSSC చక్బందీ లెక్పాల్ రిక్రూట్‌మెంట్ : 1,364 జాబ్స్... ఇంటర్వ్యూ లేకుండా సెలక్షన్స్... ఇలా అప్లై చేసుకోండి

CWC జాబ్ రిక్రూట్‌మెంట్... 571 పోస్టులు... అకౌంటెంట్లు, ట్రాన్స్‌లేటర్లు...

RRB Recruitment 2019 : 1000కి పైగా పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్

NHB జాబ్స్... అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... శాలరీ రూ.42,000
First published: